Bigg Boss 7 Telugu: యావర్ ని తిట్టిన వాళ్ల బ్రదర్..! లైవ్ లో ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే యావర్ వాళ్ల బ్రదర్ వచ్చి యావర్ కి బుద్దులు చెప్పాడు. మైయిన్ డోర్ నుంచీ కాకుండా యాక్టివిటీ ఏరియా నుంచీ వచ్చిన బ్రదర్ ని చూసి యావర్ ఎమోషనల్ అయిపోయాడు. చాలా సేపు హగ్ చేసుకుని చిన్నపిల్లాడిలా ఏచ్చేశాడు. హౌస్ లో అందరినీ పలకరించిన తర్వాత యావర్ ని పక్కకి తీస్కుని వెళ్లి మరీ ఫుల్ క్లాస్ పీకాడు. వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ మద్య నీ ఆట మొత్తం పోయిందని, ఫస్ట్ వీక్స్ లో చాలాబాగా ఆడావ్ కానీ ఇప్పుడు మాత్రం నీ ఫోకస్ తగ్గిందని చెప్పాడు.

నువ్వువేరే వాళ్ల మాటలు ( రతిక ) వినద్దని ఇండైరెక్ట్ గా చెప్తూనే వాళ్లు నిన్ను పప్పెట్ ( తోలు బొమ్మ ) లాగా చేసి ఆడిస్తున్నారని అన్నాడు. నువ్వు అన్ని మాటలు నమ్మి అటు – ఇటు తిరుగుతూ యావర్ లాగా కనిపించడం లేదని చెప్పాడు. నాకు పాత యావర్ కావాలి, యావర్ చాలా బాగా గేమ్ ఆడతాడు. ఇప్పుడు నువ్వు యావర్ వి కాదని చెప్పాడు. కెప్టెన్సీ ముందు ఆడిన యావర్ నాకు కావాలని చెప్పాడు. అలాగే, సెల్ఫ్ నామినేషన్ ఎందుకు వేస్కున్నావని క్లాస్ పీకాడు.

యావర్ ని ఎలాగైత్ జనాలు ఇష్టపడ్డారో అదే యావర్ ని బయటకి తీస్కుని వచ్చి మరీ గేమ్ ఆడు అని హితబోధ చేశాడు. వేరే వాళ్ల మాటలు నీకు అనవసరం మా యావర్ ని చూపించి గేమ్ ఆడు. కప్ మాత్రమే కావాలి. ఇకేం వద్దు అంటూ డైరెక్ట్ గా చెప్పాడు. దీంతో యావర్ కి తన తప్పు చాలాబాగా ఆర్దమైంది. వచ్చి శివాజీ దగ్గర చేసి హగ్ చేస్కుని పడుకున్నాడు. యావర్ బ్రదర్ కంటే ముందు హౌస్ లోకి శోభాశెట్టి వాళ్ల మదర్ వచ్చింది.

నీకు కోపం వస్తుందని మాకు తెలుసు, కానీ నీకోపం వీళ్లపై ప్రదర్శిస్తే వాళ్లకి అర్ధం కాదు కదా అంటూ మాట్లాడింది. అలాగే, నీకు తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు, ఆ రోజులు గుర్తు చేసుకుని గేమ్ ఆడు. చక్కగా ఆడుతున్నావ్ అంటూ మాట్లాడింది. అలాగే, యావర్ కి గిఫ్ట్ గా వాళ్ల అమ్మ ఫోటోని తీసుకుని వచ్చింది. దీంతో యావర్ ఎమోషనల్ అయిపోయాడు. చాలాసేపు చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. దీంతో శోభాశెట్టి మదర్ నేను ఉన్నాను బేటా, నువ్వు ఎప్పుడైనా సరే మా ఇంటికి రా., నేను మీ అమ్మనే అంటూ మాట్లాడింది.

ఇక శోభాశెట్టి వాళ్ల మదర్ ని చూసి హౌస్ మేట్స్ (Bigg Boss 7 Telugu) అందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు. అంతేకాదు, శివాజీని అయితే అన్నా అన్నా అంటూ మాట్లాడుతూ మీరిద్దరి గొడవ చూడటానికి బాగా ఉంటుందని చెప్పింది. దీంతో వాళ్లు నామినేషన్స్ స్పూఫ్ ఒకటి చేశారు. మొత్తానికి హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఆట పూర్తిగా మారిపోయింది. మరి ఈ నేపథ్యంలో టాప్ – 5కి ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus