Yevade Subramanyam Collections: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘ఈగ’ (Eega) తర్వాత నాని (Nani)  నుండి వచ్చిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. రాజమౌళి (S. S. Rajamouli) సెంటిమెంట్ నానిపై గట్టిగానే పనిచేస్తుంది అని అంతా అనుకుంటున్న టైంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’  (Yevade Subramanyam) సినిమా వచ్చింది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా కీలక పాత్ర పోషించాడు. 2015 మార్చి 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విచిత్రం ఏంటంటే.. అదే రోజున నాని నటించిన ‘జెండా పై కపిరాజు’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది.

Yevade Subramanyam Collections:

అయితే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కి (Yevade Subramanyam) పాజిటివ్ టాక్ వచ్చింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి రిజల్ట్ నే అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.68 Cr
సీడెడ్ 0.70 Cr
ఉత్తరాంధ్ర 1.65 Cr
ఈస్ట్ 0.38 Cr
వెస్ట్ 0.30 Cr
గుంటూరు 0.68 Cr
కృష్ణా 0.43 Cr
నెల్లూరు 0.20 Cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.02 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.80 Cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 7.82 Cr (షేర్)

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా రూ.6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.7.82 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.1.32 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ‘ఈగ’ తర్వాత నానికి మళ్ళీ క్లీన్ హిట్ అందించిన సినిమా ఇదే కావడం విశేషంగా చెప్పుకోవాలి.

నితిన్ తో మరోసారి జోడీ కడుతున్న కీర్తి సురేష్?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus