దర్శకుడు రవిబాబు పరిచయం చేసిన నటుడు కృష్ణ బూరుగుల వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు

రవిబాబు తన రీసెంట్ మూవీ క్రష్ (Crrush) చిత్రంలో కృష్ణ బూరుగుల ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కీ హీరోగా పరిచయం చేసాడు. క్రష్ చిత్రం తోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుడు “సునీల్ కుమార్ రెడ్డి” రీసెంట్ మూవీ “మా నాన్న నక్సలైట్” తో మరోసారి తన అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం లో తన నటన హైలైట్ గా చూడొచ్చు. నటుడిగా రెండవ చిత్రం అయిన, ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. కృష్ణ బూరుగుల నటనలో శిక్షణ పొంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, అప్రంటీస్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. వందల ఆడిషన్లు ఇచ్చారు.. సొంతంగా ఒక 100 ఆడీషన్ వీడియోలు తీసి యూట్యూబ్ లో ఇంకా తన సొంత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి వాటిని ఇండస్ట్రీ వ్యక్తులకి పంపించి సినిమా అవకాశాలు దక్కించుకుంటూ నటుడిగా బిజీ గా వున్నాడు.

ఇప్పుడు కొరటాల శివ గారు సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ చిత్రం లో రెండవ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ సమర్పణలో వస్తున్న ఎ టి ఎం (ATM) అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఎగ్జీకుటీవ్ ప్రొడ్యూసర్ కృష్ణ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లు మొదలుపెట్టనున్నాడు.

గతంలో కూడా రవిబాబు చాలా మంది నటులని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు అందులో అల్లరి నరేష్, విజయదేవరకొండ.. మంచి నటులుగా నిరూపించుకొని స్టార్స్ అయ్యారు. కృష్ణ బూరుగుల ప్రయాణం అలాగే ముందుకువెళ్ళే సూచనలు కనబడుతున్నాయి.. చూద్దాం ఇతగాడు ప్రయాణం ఎలా ముందుకుతీసుకెలతాడో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus