ఓ యువ నటి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నడ ఇండస్ట్రీలో ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. అక్కడి టీవీ నటి మెబీనా(22).. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇంత చిన్న వయసులోనే ఆమెకు ఇలా అవ్వడం పట్ల అందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా ఆమె తోటి ఆర్టిస్ట్ లు… సన్నిహితులు, టెలివిజన్ దర్శక నిర్మాతలు చాలా బాధపడుతున్నారు. చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీలో చాలా వరకూ విషాదం ఛాయలు నెలకొన్నాయి.
మంగళవారం నాడు మెబీనా తన స్వస్థలమైన మెడికెరికి బయల్దేరి వెళ్తుండగా దేవీహళ్లి లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఓ ట్రాక్టర్ ఆమె కారు పైకి దూసుకురావడంతో ఇలా జరిగిందని సమాచారం. ఇక మెబీనా విషయానికి వస్తే.. ఈమె ఒక మోడల్. ఎలాగైనా సినీ ఇండస్ట్రీలో రాణించాలి అని నటిగా మారింది. ‘ప్యాటే హుదుగిర్ హళ్లీ లైఫ్ 4’ అనే రియాలిటీ షోలో ఈమె విన్నర్ గా నిలిచి టైటిల్ కైవసం చేసుకుందట. దాంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.
అది అలా అవకాశాలు తెచ్చిపెట్టడానికి కూడా కారణమైందట. ‘కచ్చితంగా ఈమె మంచి నటి అయ్యి.. ప్రేక్షకులను మరింతగా అలరిస్తుంది అనుకున్న టైములో ఇలా జరగడం విషాదకరమని… నిండా పాతికేళ్ళు కూడా లేని ఈమెను ఆ దేవుడు తీసుకెళ్ళి చాలా పెద్ద అన్యాయం చేసాడు’ అంటూ ఆమె స్నేహితులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్