తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరిన యువ హీరో..!

ఈ మధ్య కాలంలో వరుసగా సినీ నటులు గాయాల పాలవడం మనం చూస్తూనే వస్తున్నాం. జబర్దస్త్ కమెడియన్, సహాయ నటుడు, హీరో అయిన అదిరే అభి షూటింగ్ లో గాయపడగా .. అతని చేతికి ఏకంగా 15 కుట్లు పడ్డాయి. ఇక ఇటీవల రవితేజ కూడా టైగర్ నాగేశ్వర రావు చిత్రం షూటింగ్ లో భాగంగా గాయపడగా అతని చేతికి పది కుట్లు పడ్డాయి. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడా గాయపడినట్టు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కన్నడ నటుడు దిగంత్ గోవా బీచ్ లో సమ్మర్ సాల్ట్ జంప్ చేస్తున్న క్రమంలో గాయపడినట్టు తెలుస్తోంది. తన భార్య ఐంద్రితా రాయ్‌తో కలిసి హాలిడేస్ లో భాగంగా గోవా ట్రిప్ కు వెళ్ళాడు దిగంత్. ఫిట్‌నెస్ ఫ్రీక్, లవ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే అతనికి మక్కువ ఎక్కువ.అందుకే దిగంత్ సమ్మర్‌సాల్ట్ కు ఇంట్రెస్ట్ చూపాడు. అంతే ఇలా జరిగింది. ఈ ప్రమాదంలో దిగంత్‌కు మెడకు బలమైన గాయమయ్యింది.

దీంతో అతనికి గోవాలో ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించి తరువాత బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్‌కి ఎయిర్‌లిఫ్ట్‌ చేసి తీసుకు వెళ్ళారు. దిగంత్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న ఆసుపత్రి వైద్యులు.. కొద్ది రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అంటున్నారు.అలాగే చిన్నపాటి సర్జరీ కూడా అవసరం పడుతుంది అని..

కొంతకాలం అతను నడవలేడని కూడా తెలిపారు. అలా అని వెన్నెముక కి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదని.. కంగారు పడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.ఇక దిగంత్ తెలుగులో వాన సినిమాలో సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. అలాగే కన్నడ లో ఎవరు రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus