డాన్స్ మాస్టర్ తో యంగ్ హీరో సినిమా!

ఈ ఏడాదిలో ‘అశ్వథ్థామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య మంచి సక్సెస్ ని అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మార్చి నుండి కరోనా కారణంగా లాక్ డౌన్ పడటంతో షూటింగ్ లకు బ్రేక్ వచ్చింది. అయితే తానొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేసి.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు ఈ హీరో. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక లేటెస్ట్ గా మరో సినిమా అనౌన్స్ చేశాడు ఈ హీరో. ‘అలా ఎలా’ ఫేమ్ దర్శకుడు అనీష్ కృష్ణ కాంబినేషన్ లో శౌర్య సినిమా చేయబోతున్నాడు.

ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా శౌర్య మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ డాన్స్ మాస్టర్ చెప్పిన కథ శౌర్యకి నచ్చిందట. దీంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘ఢీ’ షో ద్వారా పాపులర్ అయిన డాన్స్ మాస్టర్ లలో సన్నీ ఒకరు. సినిమా ఆడియో ఫంక్షన్స్ లో, ఈవెంట్ లలో సన్నీ డాన్స్ షోలు చేస్తుంటాడు. కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ కూడా అందించారు.

ఇప్పుడు సన్నీని దర్శకుడిగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు నాగశౌర్య. అయితే ఇందులో హీరోగా కాకుండా కేవలం నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు శౌర్య. ఐరా సంస్థలో ఈ సినిమాని నిర్మించనున్నారు. ముగ్గురు కొత్త హీరోలు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. హారర్, క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. దసరా రోజు లాంఛనంగా ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకిరానున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus