మేనేజర్ తో ప్రేమాయణం.. అందుకే కెరీర్ ఇలా..?!

  • May 1, 2024 / 03:35 PM IST

హీరోయిన్ల కెరీర్ అనేది వారి టాలెంట్, గ్లామర్ పై మాత్రమే కాదు.. చాలా వరకు మేనేజర్లపై ఆధారపడి ఉంటుంది ని ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. సరైన ప్రాజెక్టు పట్టడం… దానికి హీరోయిన్ సైన్ చేసేలా చేయడం అనేది మేనేజర్ ప్రథమ కర్తవ్యం. అంతేకాదు ఆమెతో పాటు షూటింగ్ కి వెళ్లి.. నిర్మాతలను అప్రోచ్ అయ్యేది వీరే. అంతేకాదు వీళ్ళకి బ్రాండ్స్ అవి తెప్పించేది కూడా మేనేజర్లే. అయితే మేనేజర్ కనుక కరెక్ట్ గా లేడు అంటే హీరోయిన్ కెరీర్ ఫినిష్ అయిపోవడం ఖాయం.

అది హీరోయిన్లు రియలైజ్ అయ్యే టైంకి చాలా డామేజ్ జరిగిపోతుంది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే….లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఓ యంగ్ హీరోయిన్ తన మేనేజర్ తో డేటింగ్ లో ఉందట. కెరీర్ మొదట్లో ఆమె చిన్న సినిమాల్లో నటించింది. అనూహ్యంగా ఓ పెద్ద హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. అది పెద్దగా ఆడలేదు కానీ.. ఆ సినిమా వల్ల ఈమెకు వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

అయితే సరైన పాత్రలు ఎంపిక చేసుకోవడంలో ఈమె విఫలమవుతుంది. చేసిన సినిమాలు కూడా నిలబడట్లేదు. దీని వెనుక కారణం ఏంటా? అని ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆరాతీస్తే.. ఆ హీరోయిన్.. మేనేజర్ తో డేటింగ్లో ఉందని.. దాని వల్ల గుడ్డిగా అతను ఏం చెబితే అది చేస్తుంది అని, అందుకే ఆమెకు వరుసగా ప్లాప్స్ వస్తున్నాయని అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus