రజనీ – మురుగదాస్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ..?

ఒక పక్క ‘2.0’ జోరు ఇంకా తగ్గక ముందే ‘పెట్టా’ చిత్రంతో వచ్చేస్తున్నాడు సూపర్ స్టార్ రజనీ కాంత్. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ్ లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం తరువాత మురుగదాస్ డైరెక్షన్లో ఒక చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు తలైవా. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. మురుగదాస్ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నాడు. అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ను జోడిస్తూ ఒక మెసేజ్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోందట. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

ఇక ఈ క్రేజీ చిత్రంలో మొదట నయనతార ను హీరోయిన్ గా అనుకున్నారట. అయితే ఇప్పడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్. కీర్తి సురేష్ కు 2018 గోల్డెన్ ఇయర్ అని చెప్పడంలో సందేహం లేదు. ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ చిత్రం నిరాశ పరిచినప్పటికీ పెద్ద ఆఫర్లు రావడానికి ఈ చిత్రం కీర్తి సురేష్ కు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఇక సమ్మర్ లో రిలీజైన ‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తమిళ్ లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే చియాన్ విక్రమ్ తో ‘సామి’, విశాల్ తో ‘పందెం కోడి2’ చిత్రాల్లో నటించింది. విజయ్ -మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్’ చిత్రంలో కూడా హీరోయిన్ కీర్తీ సురేషే కావడంతో మరోసారి రజనీ చిత్రంలో కూడా ఎంపిక చేయనున్నాడట మురుగదాస్. అయితే రజనీకాంత్ ప్రస్తుతం తన ఏజ్ కు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. అంతే కాదు హీరోయిన్స్ విషయంలో కూడా సీనియర్ హీరోయిన్సునే ఓకే చేస్తున్నా డు. మరి ఈ క్రమంలో కీర్తి సురేశ్ ను ఫైనల్ చేస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus