మనసులోని మాటను బయట పెట్టిన ప్రభాస్!

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లోని అమీర్ పేటలో వేసిన ఓ ఇంటి సెట్ సెట్ లో ప్రభాస్, శ్రద్ధలపై కొన్ని రొమాంటిక్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆసక్తికర సంగతులు చెప్పారు. “పదిహేనేళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ, ఒక స్టార్ గా ఎలా నడుచుకోవాలో తెలియలేదు. బాహుబలితో వచ్చిన  స్టార్ ఇమేజ్‌ను కూడా  ఆస్వాదించలేక పోతున్నాను” అని అన్నారు.

“నేను ఎక్కువగా బయటికి రానని కంప్లైంట్ ఇస్తుంటారు. బాధపడుతుంటారు. అభిమానుల మధ్యన వెళ్ళడానికి అలవాటు చేసుకుంటున్నాను. ఈ విషయంలో ఇప్పుడు బెటర్. ఇంకా మెరుగుకావాల్సి ఉంది” అని వివరించారు. అయితే ఇంటర్వ్యూలంటే తనకు ఇప్పటికీ చాలాసిగ్గని, దాని నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నానని వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus