తన పెదనాన్న కృష్ణంరాజుకి.. వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్..!

ప్రస్తుతం ‘సాహూ’ చిత్రం చేస్తూనే తన 20 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టేసాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ‘సాహూ’ చిత్రాన్ని ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా… ‘ప్రభాస్ 20’ ని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తన పెదనాన్న అయిన కృష్ణంరాజు తీరుతో ప్రభాస్ విసిగిపోయినట్లు తాజా సమాచారం. అదేంటి కృష్ణంరాజు తీరుతో ప్రభాస్ విసిగిపోవడం ఏంటనేగా మీ డౌట్..!విషయంలోకి వెళితే తాజాగా కృష్ణంరాజు తన పుట్టిన రోజు సందర్బంగా ఓ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ప్రభాస్ పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకు .. ‘సాహూ’ చిత్రం తర్వాత ప్రభాస్ పెళ్ళి ఉంటుందని ‘ కృష్ణంరాజు చెప్పారు. ఇలా తరచూ మీడియా ముందు తన పెళ్ళి గురించి మాట్లాడడం ప్రభాస్ కి నచ్చడం లేదట.

ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్న ప్రతిసారి కృష్ణంరాజు మీడియా ముందుకొచ్చి ఏదో ఒక క్లారిటీ ఇస్తున్నాడు. గతంలో కూడా ‘బాహుబలి’ పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్ళి ఉంటుందని కృష్ణంరాజు చెప్పాడు. ఇప్పుడు ‘సాహూ’ చిత్రం అయ్యాక ఉంటుందని చెప్పాడు. ఇలా ఇప్పటికే చాలా సార్లు ప్రభాస్ పెళ్ళి గురించి కామెంట్స్ చేశాడు కృష్ణంరాజు. ఈ విషయం పై ప్రభాస్ ఫైర్ అయ్యాడట… ‘తన సినిమాలకు సంబంధించి వార్తలే ఉండాలి కానీ.. ఇలా తన వ్యక్తిగత విషయాలు ఉండకూడదని కృష్ణంరాజుకి .. గట్టిగా చెప్పాడట ప్రభాస్. ఇక పై మీడియాలో తన పెళ్ళి గురించి ఎలాంటి కామెంట్స్ చేయకూడదని కూడా చెప్పాడట. ఇక ప్రభాస్ తీరు చూస్తుంటే… ఇప్పట్లో తను పెళ్ళిచేసుకునే ఆలోచనలో ఉన్నట్లు లేడని…. ప్రభాస్ సన్నిహిత వర్గాల వారు చెబుతున్నారు. ఇక ‘సాహూ’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus