మరోసారి రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్..?

  • February 1, 2019 / 11:22 AM IST

‘బాహుబలి’ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలు గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తుంది. ‘బాహుబలి’ తో రాజమౌళి సినిమా అంటే జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంకోసం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లుకొడుతుంది.

ఈ చిత్రంలో రాజమౌళి అదనపు ఆకర్షణలు జోడిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే… ఈ చిత్రంలో ప్రభాస్ తో ఓ రోల్ చేయించాలని జక్కన్న భావిస్తున్నాడట. తాజాగా ఈ విషయం పై చిత్రబృందంతో కూడా చర్చించాడంట రాజమౌళి. ఇది నిజమైతే.. ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ లను ఒకే స్క్రీన్ పై చూడొచ్చన్నమాట. అయితే ఈ విషయం పై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రానికి సంబందించిన రెండో షెడ్యూల్ ను … గత వారం రోజులుగా రాజమౌళి బ్రేక్ లేకుండా చిత్రీకరిస్తున్నాడట. ఈ షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన సీన్లను హైదరాబాద్ నగర శివార్లలో వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ షెడ్యూల్ కూడా పూర్తి కానుంది. ఇక ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి హీరోయిన్ల విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీ.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus