యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా సినిమా సినిమాకు లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టెంపర్ సినిమా నుంచి తారక్ ప్రతి సినిమా సక్సెస్ సాధించడానికి లుక్ కూడా కారణమనే సంగతి తెలిసిందే. అయితే తారక్ కొత్త లుక్ లో దిగిన మరో ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో చూసిన ఫ్యాన్స్ తారక్ భలే ఉన్నాడని చెబుతున్నారు.
అభిమానితో తారక్ ఫోటో దిగగా ఆ ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. దేవర ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానుండగా దేవర2 షూట్ ఎప్పుడు మొదలవుతుందో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది. దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేయడంతో పాటు కొరటాల శివకు భారీ హిట్ దక్కాలని కోరుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది చివరినాటికి దేవర సినిమాను పూర్తి చేసి వార్2 సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. వార్2 సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హృతిక్, తారక్ కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి కూడా అతి త్వరలో అప్ డేట్స్ రానున్నాయని సమాచారం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలతో కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్లు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సొంతమవుతాయేమో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరింత ఎదిగి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. తారక్ సైతం కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!