Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ నుండి యూత్‌ఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ నుండి యూత్‌ఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

  • February 14, 2023 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ నుండి యూత్‌ఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

సినీ ప్రపంచంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఉండే డిమాండే వేరు. యూత్ ఆడియన్స్ మెచ్చే కథాకథనం ఉందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి తొలి మెట్టు అక్కడే పడినట్లు. ఇక ఆ సినిమాను తెరకెక్కించే విధానం, నిర్మాణ విలువలతో పక్కా హిట్ అనే ధైర్యం మేకర్స్‌కి వచ్చేస్తుంది. సరిగ్గా అదే ఫార్ములాతో వస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై కొత్త హీరో హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజేష్ దొండపాటి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆయన ఈ సినిమాతో డైరెక్టర్‌గా అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా లవ్ ఆంథెమ్ ఆఫ్ 2023 పేరుతో ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. చూడు చూడు చూడమంటూ గుండె.. అంటూ సాగిపోతున్న ఈ పాటలో వరికుప్పల యాదగిరి రాసిన లిరిక్స్ మనసుకు హత్తుకుంటున్నాయి. యశస్వి కొండేపూడి, సాహితి చాగంటి ఆలపించిన తీరు పాటకు ప్రాణం పోసింది. లిరిక్స్ కి తగ్గ విజువల్స్ జోడించి ఈ సాంగ్ రూపొందించిన విధానం యూత్ ఆడియన్స్ మెప్పు పొందేలా ఉంది. నిజమైన ప్రేమికుల ఫీలింగ్స్ చెబుతూ పల్లెటూరి వాతావరణంలో షూట్ చేసిన ప్రతి సీన్ కూడా పాటలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. సాబు వర్గీస్ బాణీలు ఈ సాంగ్ లో మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది.

ఇప్పటికే ఈ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు చూడు చూడు లిరికల్ సాంగ్ ఆడియన్స్ దృష్టిని సినిమా వైపు మళ్లించింది.

రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు. ఎస్ కే రఫి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #krishna gadu ante oka range
  • #Tollywood

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

4 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

4 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

17 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version