ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు ఊపందుకుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన పలువురి సినీ,రాజకీయ, క్రీడారంగానికి చెందిన ప్రముఖుల నిజ జీవితాలని వెండితెర పై ఆవిష్కరించడం పై బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుందని ‘మహానటి’ చిత్రం నిరూపించింది. ఇక ఆ ఆసక్తి లోపిస్తే ప్రేక్షకులు కూడా నిరాకరిస్తారని ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం తేల్చి చెప్పేసింది.
ఎన్టీఆర్ జీవిత కథ కావడంతో… ఈ చిత్రం కోసం ఎన్నో అసలు పెట్టుకున్న అభిమానులకి నిరాశే మిగిలిందని చెప్పాలి. దీనికి ముఖ్య కారణం కల్పితాలు ఎక్కువ ఉండడమే అని చెప్పుకొస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నే జనాలు చూడలేదంటే మరి వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ పరిస్థితేంటని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనేది చర్చనీయాంశమయ్యింది. అందులోనూ వైఎస్ఆర్ జీవితంలో ఆసక్తి కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి… అందులోనూ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా ముఖ్యమైన అంశం. అయితే ఆ అంశాన్ని ఈ చిత్రంలో టచ్ చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్ పాదయాత్ర, జనాల మంచి కోరుకునే నాయకుడిగా మాత్రమే వైఎస్ఆర్ పాత్రని తీర్చి దిద్దారట. ఇప్పట్లో బయోపిక్ అయినా.. సాధారణ సినిమా అయినా… ప్రేక్షకులు సహజత్వం కోరుకుంటున్నారు…, ఆ విషయంలో ‘మహానటి’ విజయం సాధించింది.., అక్కర్లేని భజన చేసి.. అవసరం లేకపోయినా గొప్పోడు.. గొప్పోడు.. అంటూ.. బయోపిక్ లో కూడా కమర్షియల్ ఎలెమెంట్స్ ను బలవంతంగా ఇరికిస్తే కష్టమని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంతో తేలిపోయింది. మరి ఇదే తరహాలో వస్తున్న ‘యాత్ర’ చిత్ర ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకూ వేచి చూడాల్సిందే..!