జీ గ్రూప్ చేతికి ‘వరుడు కావలెను’!

యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ముందుగా ‘వరుడు కావలెను’ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ గ్లిమ్ప్స్, పోస్టర్స్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ కూడా జోరుగా జరుగుతోంది. ఈ మధ్యకాలంలో శాటిలైట్-డిజిటల్ డీల్స్ లో దూసుకుపోతున్న జీ గ్రూప్ సంస్థ ‘వరుడు కావలెను’ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను అటు ఇటుగా రూ.6 కోట్ల రూపాయలకు ఈ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ పై తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘బాబు బంగారం’, ‘జెర్సీ’ లాంటి సినిమాలను జీ గ్రూపే కొనుగోలు చేసింది. ఇప్పుడు సెట్స్ పై ఉన్న ‘రంగ్ దే’ సినిమాను కూడా జీ గ్రూప్ దక్కించుకుంది. ఇప్పుడు ‘వరుడు కావలెను’ సినిమా కూడా ఇదే సంస్థ చేతికి చేరింది.

ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య అనే లేడీ డైరెక్టర్ పరిచయం కానుంది. రీతువర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నదియా కీలక పాత్రలో కనిపించనుంది. రీసెంట్ గా ప్రేమికుల రోజు నాడు ఈ సినిమా నుండి ఓ సింగిల్ ను రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన పాటకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus