అంచనాలే తలకిందులై..బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డ సినిమాలు

తమ అభిమాన హీరోల సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అవ్వాలి అని ప్రతీ అభిమాని కోరుకుంటాడు. అయితే ఎన్నో అంచనాలతో విడుదలయ్యి భారీ హిట్ అవుతుంది అనుకున్న సినిమా డిజాష్టర్ గా మారిపోతే సగటు అభిమాని బాధ అంతా ఇంతా కాదు, అలా విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ఇవే…

బిగ్ బాస్

భారీ హిట్స్ తో దూసుకుపోతున్న చిరు ‘బిగ్ బాస్’ సినిమా భారీ డిజాష్టర్ ను చవి చూసింది.

సీమ సింహం

ఫ్యాక్‌షన్ సినిమాల కధలతో రికార్డుల దుమ్ము దులిపిన బాలయ్య ‘సీమ సింహం’ అనుకోని విధంగా ఫ్లాప్ కావడం అభిమానుల ఆశలను ఆవిరి చేసింది.

మృగ రాజు

చిరు- బాలయ్య సంక్రాంతి రేస్ లో చిరుని పలకరించిన డిజాష్టర్ సినిమాల్లో ‘మృగరాజు’.

టక్కరి దొంగ

చాలా కాలం తరువాత కౌబోయ్ గెట్ అప్ లో మహేష్ అలరిస్తాడు అనుకున్న అభిమానులకు ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది.

జానీ

దాదాపుగా రెండు-మూడు ఏళ్ల గ్యాప్ తరువాత వచ్చిన పవన్ కళ్యాణ జానీ చిత్రం పవన్ కరియర్ లోనే కాదు, సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ డిజాష్టర్ గా నిలిచింది.

ఆంధ్రవాలా

భారీ సమూహంతో ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ‘ఆంధ్ర వాలా” అనుకోని రీతిలో జనవరి1నాడు విడుదలయ్యి భారీ అంచనాలను తలకిందులు చేసి, డిజాస్టర్ గా నిలిచింది.

ఒక్క మగాడు

భారీ అంచనాలతో విడుదలయిన ‘ఒక్క మగాడు’ బాలయ్య కరియర్ లోనే భారీ డిజాస్టర్ ను చవి చూసి, దర్శక నిర్మాత వై.వీ.ఎస్ చౌదరికి భారీ నష్టాలని మిగిల్చింది.

బద్రినాధ్

రామ్ చరన్ మగధీర తరువాత అల్లు అర్జున్ అదే తరహాలో చేసిన బద్రినాధ్ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది.

రెబెల్

రెబల్ స్టార్ అభిమానులు ఎన్నో అంచాలను పెట్టుకున్న  ప్రభాస్ రెబల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల బడింది.

ఆగడు

దూకుడు సినిమా తరువాత భారీ అంచనాలతో విడుదలయిన ‘ఆగడు’ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అనుకున్నారు అందరూ, కానీ అనుకోని విధంగా భారీ డిజాస్టర్ గా మిగిలి పాపం దర్శకుడికి భారీ ఇక్కట్లు తెచ్చిపెట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus