సుధాకర్ గురించి 10 ఆసక్తికర సంగతులు..!!

  • August 1, 2016 / 01:04 PM IST

బి. సుధాకర్ అంటే అందరికీ తెలియక పోవచ్చు కానీ, పిచ్చకొట్టుడు సుధాకర్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తే. సూర్య వంశం, శుభాకాంక్షలు, అల్లుడు గారు, సుస్వాగతం వంటి 600 సినిమాల్లో నటించి నవ్వించిన ఇతను అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత మొహానికి రంగు పూసుకున్నారు. సాయి రామ్ శంకర్ హీరో గా చేస్తున్న “వాడు నేను కాదు”లో కీలక రోల్ పోషించారు. ఈ చిత్రం ద్వారా పూర్వ వైభవం సాధిస్తాను అని చెబుతున్న సుధాకర్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర సంగతులు.

1. సుధాకర్ స్వస్థలం మార్కాపూర్ (ప్రకాశం జిల్లా). చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నారు. తమిళ సినిమాల్లో అడుగు పెట్టారు.

2. తమిళంలో హీరోగా 35 సినిమాలు చేశారు. ఎక్కువ శాతం విజయం సాధించాయి. ఏడాది పాటు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ప్రముఖ నటి రాధికతో కలిసి 13 చిత్రాల్లో నటించారు.

3. మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ రూమ్ మేట్స్. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే చిరంజీవి హీరోగా పెట్టి యముడికి మొగుడు చిత్రాన్ని నిర్మించారు.

4. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. సుధాకర్ దంపతులకు పెళ్లి అయినా పదేళ్లకు బెనటిక్ మైఖేల్ (బెన్నీ) అనే కొడుకు పుట్టాడు. ప్రస్తుతం అతను ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

5. తమిళ చిత్రాలు చేసేటప్పుడు అనేక అవార్డులు, బిరుదులు అందుకున్న సుధాకర్ పెద్దరికం, స్నేహితులు అనే రెండు సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు.

6. సుధాకర్ ముక్కు సూటిగా ఉంటారు. షూటింగ్ కాగానే ఇంట్లో వాలిపోతారు. సినీ వాళ్లతో అనుబంధం చాలా తక్కువ. తనికెళ్ల భరణి, జేడీ చక్రవర్తి మంచి స్నేహితులు.

7. సుధాకర్ హీరో, కమెడియన్ గానే కాదు కింగ్ నాగార్జున “మజ్ను” సినిమాలో విలన్ గా నటించారు. తన విలనిజం తో మెప్పించారు.

8. ఓ సారి సుధాకర్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురయింది. అయితే అందులో ప్రయాణికులం దరూ క్షేమంగా బయటపడ్డారు. అయినా ఆ తర్వాత భయంతో కొంత కాలంగా విమానం ఎక్కలేదు.

9. ప్రముఖ దర్శకులు రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ లో సుధాకర్ నటించారు. tv5 లో “రాజకీయ భేతాళం” అనే ప్రత్యేక షో చేశారు.

10. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించడానికి సుధాకర్ ఆసక్తిగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోను నటించి నవ్వించాలని ఆశపడుతున్నారు. వీరిద్దరూ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లోను తనతో సరదాగా ఉంటారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడున్న కొత్త దర్శకుల్లో మారుతి శైలి విభిన్నంగా ఉందని అతని చిత్రాల్లో మంచి పాత్ర వస్తే ఇష్టంగా చేస్తానని వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus