PS1: ఈ 10 మైనస్సుల వల్లే ‘పొన్నియన్ సెల్వన్ -1’ కి మిక్స్డ్ టాక్ వచ్చిందా?

  • September 30, 2022 / 09:11 PM IST

ఇండియాలో ఉన్న గొప్ప ఫిలిం మేకర్స్ లో మణిరత్నం కూడా ఒకరు. ఆయన ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాలని 4 దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొత్తానికి నానా తిప్పలు పడి తాను అనుకున్నట్టుగా ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్ తో మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్ పై మణిరత్నం ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.’పొన్నియన్ సెల్వన్’ రెండు పార్టులని కలిపి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో సెప్టెంబర్ 30ని ఈరోజు విడుదల చేశారు. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి భారీ తారాగణం నటించిన ఈ మూవీకి మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ వస్తుంది. అందుకు కొన్ని మైనస్సులు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కల్కి రచించిన పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకం ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చోళ రాజ్యాన్ని సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) విజయవంతంగా పరిపాలిస్తుండగా.. తదుపరి రాజుగా సుందర చోళుడి చిన్న కుమారుడు అరుల్ మోజీ వర్మన్ అలియాస్ పోన్నియన్ సెల్వన్ (జయం రవి) ప్రకటించడానికి మంత్రివర్గం సిద్ధమవుతుంది. అయితే.. పోన్నియన్ సెల్వన్ స్థానంలో మధురంటక (రెహమాన్) రాజవ్వాలనుకుంటాడు. ఈ అంతర్యుద్ధంలో.. నందిని (ఐశ్వర్య రాయ్) కుతంత్రం, కుందవలి (త్రిష) రాజకీయతంత్రం ఎలాంటి పాత్ర పోషించాయి అనేది “పోన్నియన్ సెల్వన్” తొలి భాగం కథాంశం.వినడానికి చెప్పుకోడానికి ఈ కథ బాగానే ఉంది. కానీ తెర పై ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడు.

2) చరిత్రని ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. మణిరత్నం తన స్క్రీన్ ప్లే తో ఆ విధంగా చెప్పలేకపోయాడు అన్నది వాస్తవం.

3) సినిమాలో లెక్కలేనన్ని పాత్రలు ఉంటాయి. వాటికి సరైన ఇంట్రడక్షన్ ఉండవు. వస్తుంటాయి, పోతుంటాయి. సరిగ్గా గుర్తుంచుకునే పాత్రలు 4,5 మాత్రమే.

4) ఫస్ట్ హాఫ్ లో మెయిన్ పాయింట్ కు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ చూడటానికి చాలా ఓపిక కావాలి.

5) విక్రమ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడు కానీ.. అది అక్కడక్కడ మాత్రమే మెరుస్తుండడం ఓ మైనస్.

6) కార్తీ చాలా చక్కగా నటించాడు. 160 నిమిషాల పాటు ప్రేక్షకులు ఓపిగ్గా కూర్చున్నారు అంటే ఇతని నటన వల్లే. కాకపోతే ఇతను పలికే డైలాగులు పూర్తి స్థాయిలో అర్థం కావు.

7) జయం రవి పాత్ర బాగుంది. ఇదే పాత్రని మొదట మహేష్ బాబుతో చేయించాలని దర్శకుడు అనుకున్నాడట. ఓ రకంగా ఇది టైటిల్ రోల్. కానీ సినిమాలో మాత్రం గెస్ట్ రోల్ అన్నట్టు చూపించారు.

8) యాక్షన్ ఎపిసోడ్స్ లెక్కలేనన్ని ఉన్నాయి కానీ ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్ లేదు.

9) పాటలు పెద్దగా ఆకట్టుకోవు. ఏవీ కూడా గుర్తుండవు. సందర్భానికి తగినట్టు వచ్చినట్టు అస్సలు అనిపించవు.

10) సినిమా మొత్తం టెక్నికల్ టీం పైనే ఆధారపడి తీశాడు దర్శకుడు మణిరత్నం. ఈ క్రమంలో అతని మార్క్ ఎమోషన్ మిస్ అవుతుంది అని అస్సలు గ్రహించలేదు. ఇదొక మైనస్. ఒకవేళ పార్ట్ 2 ఏమైనా గొప్పగా తీస్తాడేమో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus