మనల్ని ఎంటర్టైన్ చేసే మీడియా సినిమా. మూడుగంటల సేపు బాధలన్నీ మరిచిపోవాలని ప్రేక్షకులందరూ థియేటర్ కి వెళ్తారు. ఆ చిత్రంలో పాత్రలు నవ్విస్తే నవ్వుతారు.. ఏడిస్తే ఏడుస్తారు. పాటలొస్తే డ్యాన్స్ చేస్తారు. ఫైట్స్ వస్తే విజిల్స్ వేస్తారు. ఇంటికి రాగానే పాత్రల్ని, సినిమాని పూర్తిగా మరిచిపోతారు. కానీ కొన్ని సినిమాల్లోని పాత్రలు మనసులో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఆ క్యారెక్టర్ చేసిన పనులను నిజ జీవితంలో చేయడానికి ఇష్టపడుతారు. అంతలా ప్రభావితం చేసిన తెలుగు సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్స్ పై ఫోకస్..
1 . హర్ష (శ్రీమంతుడు)గోల్డెన్ స్పూన్ తో పుట్టి.. కష్టమంటూ తెలియకుండా పెరిగిన ఒక యువకుడు పేదల గురించి, తన ఊరు బాగోగులు గురించి ఆలోచించడం.. తెలుగు ప్రజలకు బాగా నచ్చింది. ఎంతంటే తాము కూడా సొంత ఊరు గురించి పట్టించుకునేంత. శ్రీమంతుడు సినిమాలో హర్ష పాత్ర ప్రేక్షకుల్లో చైతన్యాన్ని రగిలించింది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుతో పాటు అనేకమంది సంపన్నులు సొంత ఊర్లను దత్తత తీసుకుని బాగు చేశారు.
2 . ఠాగూర్ (ఠాగూర్ )మనదేశాభివృద్ధికి చీడపురుగు లాంటిది లంచం. దీనిని లేకుండా చేస్తే దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఈ లంచంపై సమరం ప్రకటించిన వ్యక్తి ఠాగూర్. ప్రాణాలను లెక్కచేయకుండా అవినీతిని అంతమొందించడానికి ఠాగూర్ చేసే పనులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
3 . రామకృష్ణ (రాఖి)ఆడపడుచులపై దాడులు చేయకుండా ఉండాలని కీచకులను, మృగాలను వెంటాడి, వేటాడి చంపే రామకృష్ణ అనే కుర్రోడు భలే నచ్చాడు. అమ్మాయిలా జోలికి రాకుండా ఉండాలంటే రాఖీ సినిమాలోని రామకృష్ణ లాగే ఉండాలని అందరూ అనుకున్నారు. ఆ విధంగా నటించి ఎన్టీఆర్ అందరి హృదయాల్లో నిలిచిపోయారు.
4 . అర్జున్ ప్రసాద్ (లీడర్)ప్రజల సమస్యల కోసం పోరాడే నాయకుడు ఎలా ఉండాలి? ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిన రాజకీయ నాయకుడు ఎలాంటి పనులు చేయాలి? అనే విషయాన్నీ శేఖర్ కమ్ముల లీడర్ సినిమాలోని అర్జున్ ప్రసాద్ పాత్ర ద్వారా చూపించారు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ నిజ జీవితంలోను ఇలాంటి లీడర్ మాకు కావాలి అని కోరుకున్నారు.
5 . అర్జున్ పాల్వాయి (తీన్మార్ )సమాజంలో మంచి చెడూ రెండూ ఉంటాయి. వాటిలో మంచి మాత్రమే స్వీకరిస్తూ, నిజాయితీగా బతకడం కొంచెం కష్టమైన పనే. అంతేకాదు ప్రేమను గెలిపించుకోవడం ఇంకా కష్టం. ఎంత బాధ కలిగినా చెడు మార్గంలో వెళ్లకూడదని తీన్మార్ చిత్రంలో అర్జున్ పాల్వాయి తన నడవడిక ద్వారా చెప్పాడు. ఆ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చక్కగా నటించి మెప్పుపొందారు.
6 . ప్రవీణ్ జయరామరాజు (పిల్ల జమీందార్ )ప్రతి ఒక్కరి జీవితంలో యవ్వనం అతి ముఖ్యమైనది. అప్పుడే అన్ని నేర్చుకోవాలి, కష్టపడాలి. అప్పుడు ఒళ్లు వంచని వ్యక్తి బాగుపడలేడు. ఈ నీతిని పిల్ల జమీందార్ సినిమాలో ప్రవీణ్ జయరామరాజు అనే కుర్రోడు యువకులందరికీ చాలా అర్దమయ్యేట్టు చెప్పాడు. అందుకే ప్రవీణ్ జయరామరాజు పాత్రను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.
7 . రాజా రామ్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిరంతరం శ్రమించాలి.. సాకులు ఎతుక్కుంటూ కూర్చోకూడదని రాజా రామ్ పాత్ర చాలా సింపుల్ గా చెబుతుంది. అలాగే ప్రేమ అంటే పొద్దున్న ఇష్టపడి సాయంత్రానికి మరిచిపోయేది కాదని వివరిస్తుంది. నేటి యువత వదులుకుంటున్న ఎన్నో విలువలను రాజారామ్ సున్నితంగా చెప్పి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు.
8 . విరాజ్ ఆనంద్ (S/O సత్యమూర్తి )మాట తప్పడాన్ని, తప్పు చేయడాన్నీ ఇప్పుడు తెలివితేటలు అనే కొత్త పదంతో పోల్చుతున్నారు కానీ.. ఏ కాలంలో అయినా మనిషిగా బతకడమంటే విలువలతో బతకాలి అని సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని విరాజ్ ఆనంద్ పాత్ర ద్వారా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పించారు. తండ్రి మాట కోసం తపించే విరాజ్ అందరి గుండెల్లో స్థానం సంపాదించున్నాడు.
9 . చక్రం (చక్రం)నవ్వూతూ బతకలిరా.. తమ్ముడూ.. నవ్వుతూ చావలిరా అనే పాట అందరికీ నచ్చడానికి కారణం అందరికీ అలా ఉండాలని ఉంటుంది. కానీ ఉండలేరు. చక్రం సినిమాలో ప్రభాస్ పోషించిన చక్రం మాత్రం అలాగే జీవిస్తాడు. తనని క్యాన్సర్ మహమ్మారి తీసుకుపోయే లోపున ఎక్కువమందిని నవ్వించాలని తపన పడడం అడ, మగ అని తేడా లేకుండా అందరి గుండెల్ని కన్నీటితో తడిపేసింది.
10. భద్రాచలం (భద్రాచలం)అవమానాలు అందరికీ ఎదురవుతుంటాయి.. వాటిని మెట్లుగా భావించేవారు కొందరే ఉంటారు. అటువంటి వారిలో భద్రాచలం ఒకరు. భద్రాచలం సినిమాలో రియల్ స్టార్ శ్రీహరి పోషించిన ఈ పాత్ర క్రీడాకారులకు ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చింది. ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అక్కడికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడాలని ఈ పాత్ర చైతన్యం కలిగిస్తుంది.