ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ..దీనినే షార్ట్ కట్ లో అంతా ఐ.ఎం.డి.బి అంటుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఐ.ఎం.డి.బి… అన్ని భాషల సినిమాలకు రేటింగ్స్ ఇస్తూ వస్తోంది. ఏ సినిమా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని నెటిజన్లు అనుకున్నా … ఐ.ఎం.డి.బి నే ఆశ్రయిస్తూ ఉంటారు. దీని పై వారికి గల నమ్మకం కూడా అలాంటిది మరి. ఒక్క సినిమాలకు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లకు కూడా ఐ.ఎం.డి.బి రేటింగ్స్ ఇస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… మన టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ ఐ.ఎం.డి.బి రేటింగ్స్ సాధించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) వాంటెడ్ పండుగాడ్ :
సునీల్, అనసూయ, విష్ణు ప్రియా, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్ వంటి క్రేజీ సెలబ్రిటీలు అంతా నటించిన ఈ మూవీ రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలో.. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 2.4/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
2) లైగర్ :
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 3/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
3) హైవే :
ఆనంద్ దేవరకొండ హీరోగా గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 3.7/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
4) ఆచార్య :
మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి కొరటాల శివ దర్శకుడు. ఐ.ఎం.డి.బి లో ఈ చిత్రానికి కేవలం 2.4/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
5) పక్కా కమర్షియల్ :
గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 4.2/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
6) మాచర్ల నియోజకవర్గం :
నితిన్ – కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 4.5/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
7) గని :
వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 4.6/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
8) చోర్ బజార్ :
ఆకాష్ పూరి హీరోగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 4.6/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
9) ది వారియర్ :
రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఈ మూవీకి ఐ.ఎం.డి.బి లో కేవలం 4.7/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
10) మళ్ళీ మొదలైంది :
సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయినా ఇక్కడ కూడా ఈ మూవీ మెప్పించలేకపోయింది. ఐ.ఎం.డి.బి లో కేవలం 4.7/10 రేటింగ్ మాత్రమే నమోదైంది.
అదండీ ఐ.ఎం.డి.బి లో అతి తక్కువ రేటింగ్ లు నమోదు చేసిన సినిమాలు. వీటిని ఆధారం చేసుకుని నెటిజన్లు ఈ సినిమాలను వరస్ట్ సినిమాలని డిక్లేర్ చేసేస్తున్నారు నెటిజన్లు.