‘కాంతార’ తో పాటు సౌత్ లో రూపొందిన పక్కా రా సినిమాల లిస్ట్..!

సినిమా అంటే ఒక జోనర్ కు స్టిక్ అయ్యి తీసే రోజులు పోయాయి అని అంతా అనుకుంటున్నారు. ఒకప్పుడు ప్రేమ కథైనా, యాక్షన్ సినిమా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా 6 పాటలు 4 ఫైట్స్ అన్నట్టు సాగేవి. కానీ ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి రా అండ్ రస్టిక్ స్టైల్ లో ఊర నాటు ప్రాంతీయ చిత్రాలు చేయడం అనేది చాలా సాహసంతో కూడుకున్నది. హిట్ అయితే 10 రెట్లు ప్రశంసలు కురుస్తాయి. అదే ప్లాప్ అయితే మాత్రం ఆ సినిమాలను భవిష్యత్తులో పొరపాటున కూడా చూడలేరు సరి కదా..

ఆ సినిమా తీసిన డైరెక్టర్ ను, నటీనటులను ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని రకాలుగా తిట్లు తిట్టుకుంటారు అన్నది వాస్తవం. అయితే ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు కూడా వైవిధ్యమైన సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడాలి.. వాటికే మా టికెట్ డబ్బులు అనుకునే రోజులు వచ్చాయి. ‘కాంతార’ వంటి సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి అంటే అది మారిన ప్రేక్షకుల టేస్ట్ ను తెలియపరుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కొంచెం గతంలోకి వెళ్లి చూసుకుంటే ‘కాంతార’ వంటి మాస్ జోనర్ సినిమాలు మనకి ఎన్నో వచ్చాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) శివపుత్రుడు(పితామగన్) :

విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీకి బాల దర్శకుడు. ఈ సినిమా ఊర నాటుగా ఉంటుంది. హీరోయిజం కూడా మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సక్సెస్ అయ్యింది అంటే ఇందులోని వైవిధ్యమైన కథాంశమే అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో విక్రమ్ నటనకు గాను నేషనల్ అవార్డు లభించింది.

2) మల్లిగాడు(పరుతి వీరన్) :

కార్తి హీరోగా నటించిన ఈ మూవీ ఊర మాస్ గా ఉంటుంది. అమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా అంతగా ఆడలేదు కానీ దర్శకుడు, నిర్మాత చాలా గట్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు అని చెప్పాలి. ఈ చిత్రంలో ప్రియమణి నటనకు గాను నేషనల్ అవార్డు లభించింది.

3) వాడు వీడు(అవన్ ఇవన్) :

విశాల్, ఆర్య కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి కూడా బాలానే దర్శకుడు. ఈ మూవీ కూడా ఊర మాస్ గా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి ఫలితాన్నే అందుకుంది.

4) యుగానికి ఒక్కడు :

కార్తి హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ఔట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది.

5) రంగస్థలం :

రాంచరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ చాలా ఊర మాస్ గా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన అద్భుతం అనే చెప్పాలి.

6)కేరాఫ్ కంచెరపాలెం :

వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ మూవీ కథ, కథనాలు చాలా ఊర మాస్ గా సాగుతాయి. సంభాషణలు గుర్తుండిపోతాయి. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది కానీ కచ్చితంగా చూడదగ్గ మూవీ ఇది.

7) పలాస :

కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ కూడా చాలా మాస్ గా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇది చాలా బోల్డ్ అటెంప్ట్. చాలా పచ్చిగా తీసిన సినిమా. సినిమా పర్వాలేదు అనిపించే విధంగా పెర్ఫార్మ్ చేసింది.

8) అసురన్ :

ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కథ కమర్షియల్ గా ఉంటుంది అని చెప్పలేం. కానీ హీరోయిజాన్ని చాలా బాగా ఎలివేట్ చేశాడు దర్శకుడు వెట్రిమారన్

9) పుష్ప :

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మరో రా అటెంప్ట్ ఇది. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ రూపొందిన ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది.

10) కాంతారా :

రిషబ్ శెట్టి రూపొందించిన మరో రా మూవీ ఇది. భూత కోలా వంటి ఎపిసోడ్స్ తో కొత్త హంగులను నింపి రూపొందించాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus