బ్రహ్మోత్సవం చూసేందుకు పది రీజన్లు

ఫ్యామిలీ సినిమాల డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల, సూపర్ స్టార్ మష్ బాహేబు కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో ఉన్న ప్రత్యేకతల గురించి..

కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్: బ్రహ్మోత్సవం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కుర్రోడు తన తండ్రిని, అతని చెల్లెళ్ళ కుటుంబాలని కలిసి ఉంచేందుకు చేసే ప్రయత్నమే బ్రహ్మోత్సవం. ఈ సినిమాలోని కుటుంబ సభ్యుల మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి.

శ్రీకాంత్ అడ్డాల స్క్రీన్ ప్లే, డైరక్షన్: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. కథ లైన్ ఇది వరకు వచ్చిన చిత్రాల్లో మాదిరిగా ఉన్నా శ్రీకాంత్ చూపించే విధానం ఫ్రెష్ గా ఉంటుంది. బ్రహ్మోత్సవం కథ, స్క్రీన్ ప్లే అతనిదే కాబట్టి సినిమాను ఆసక్తికరంగా మలుస్తాడని అందరి నమ్మకం.

మహేష్ బాబు నటన: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు సినిమాల తర్వాత మరోసారి మహేష్ ఫ్యామిలీ డ్రామా జాన్ర లో కథను ఎంచుకున్నాడు. సెంటిమెంట్ సీన్లను పండించగలననే నమ్మకంతోనే ఈ ప్రయత్నం చేశాడు. బ్రహ్మోత్సవంలో మహేష్ పాత్ర కొత్తగా ఉండడంతో పాటు, అతని నటనతో మరింత ఆకర్షణ తీసుకు రానున్నాడు.

ముగ్గురి నాయికలతో రొమాన్స్: అందమైన భామలు సమంత, కాజల్, ప్రణీతలతో మహేష్ రొమాన్స్ ఆడియన్స్ కళ్లకు విందుగా ఉండ బోతోంది.

భారీ తారాగణం: ‘బ్రహ్మోత్సవం’ లో సత్యరాజ్ తో పాటు ప్రముఖ తెలుగు సినీ నటీనటులు జయసుధ, రేవతి, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, రావు రమేష్‌, బ్రహ్మాజీ, నరేష్‌, పావని గంగిరెడ్డి, ఈశ్వరిరావు, తులసి, కృష్ణభగవాన్‌.. ఇలా దాదాపు 20 మంది గొప్ప నటులు ఒకే కుటుంబం సభ్యుల్లా సందడి చేశారు. వీరి నటన సినిమాకు ప్లస్ కానుంది.

పాటలు, నేపధ్య సంగీతం: మిక్కీ జే మేయర్ క్లాసిక్ పాటలను ఇచ్చారు. ఊపిరి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన గోపి సుందర్ ‘బ్రహ్మోత్సవం’ కు నేపధ్య సంగీతం సమకూర్చారు. వీరిద్దరు కలిసి సెంటిమెంట్ సీన్లను సెన్షేషన్ చేయ నున్నారు.

అద్భుతమైన లోకేషన్లు: రోబో సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రత్నవేలు బ్రహ్మోత్సవం మూవీకి పని చేశారు. అతని ప్రతిభకు అందమైన ఊటీ, వారణాసి, ఉదయ్ పూర్ వంటి ప్రాంతాలు తోడు కావడంతో … అవి స్క్రీన్ పై అద్భుతంగా కనిపించనున్నాయి.

అందమైన సెట్లు: బ్రహ్మోత్సవం కోసం తోట తరిణి వేసిన సెట్లు ఆకట్టుకోనున్నాయి. మహేష్ తో పాటు, ఆర్టిస్ట్ లు కలర్ ఫుల్ డ్రస్సుల్లో తెరపై ఇంద్ర ధనుస్సును ఆవిష్కరించనున్నారు.

డైలాగ్స్, డాన్సులు: ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి… అబ్బాయిలకు కావలసింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే దాని కోసం ఏమైనా చేసేస్తారు.. వంటి డైలాగులు ఇప్పటికే అభిమానులకు నచ్చేశాయి. ఇలాంటివి మరెన్నో ఈ సినిమాలో ఆశించవచ్చు. బిగ్ స్టార్స్ తో చేయించిన డాన్సులు సరదాగా సాగిపోనున్నాయి.

నిజ జీవితంలా..: బ్రహ్మోత్సవం సినిమా కథ, అందులోని పాత్రలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనక్ట్ అవుతారు.

తెలుగు ఇంటి కథకు కొన్ని కమర్షియల్ హంగులను జోడించి శ్రీకాంత్ అడ్డాల అందించిన ఫుల్ మీల్స్ అందరికి నచ్చుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus