RRR Movie: ‘ఆర్.ఆర్.ఆర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

  • March 24, 2022 / 10:44 AM IST

‘డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మాణంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, చరణ్ వంటి.. స్టార్ హీరోలు నటించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని వంటి వారు కీలక పాత్రలు పోషించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా బుర్రా సాయి మాధవ్ డైలోగ్స్ రాసారు. కీరవాణి సంగీత దర్శకుడు. మార్చి 25న మరో రెండు రోజుల్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కచ్చితంగా చూడడానికి 10 కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) రాజమౌళి : ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తెరకెక్కించిన మూవీ.. ‘నేను మాములు హీరోలనే సూపర్ హీరోలుగా చూపిస్తాను.. అలాంటిది చరిత్ర గర్వించదగ్గ ఇద్దరు సూపర్ హీరోల గురించి సినిమా తీస్తున్నప్పుడు ఏ రేంజ్ లో తీస్తానో మీ ఇమేజినేషన్ కే వదిలేస్తున్నా’ అంటూ రాజమౌళి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అంతే కాదు ‘బిగ్గర్ దేన్ బాహుబలి’ అని కూడా అనేశాడు.

2) ఎన్టీఆర్ : మన తారక్ అన్న సినిమా చూసి దాదాపు 4 ఏళ్ళు కావస్తోంది. ఈ మూవీలో ఆయన ‘కొమరం భీమ్’ పాత్రలో కనిపించబోతున్నాడు. ‘థియేటర్లకు తొక్కుకుంటూ పోవడమే’ అన్నట్టు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.

3) రాంచరణ్ : ‘మగధీర’ తర్వాత రాజమౌళితో చరణ్ అన్న చేస్తున్న మూవీ..! అల్లూరి సీతారామ రాజుగా ఆయన కనిపించబోతున్నాడు. ‘నక్కల వేట కాదు.. ఈసారి కుంభస్థలాన్ని కొట్టడమే’.

4) టాలీవుడ్లో చాలా కాలం తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు నటించిన మూవీ ఇది.

5) తారక్- చరణ్ కాంబోలో వచ్చే సీన్స్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలి అని..థియేటర్లలో ఆ మాస్ జాతరని చూడాలని అంతా వెయిటింగ్.

6) ఆలియా భట్ & అజయ్ దేవగన్ : తెలుగు ప్రేక్షకులకి ‘సీత’ గా పరిచయమవుతుంది ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈమె లుక్స్ కూడా బాగున్నాయి. చరణ్ తో ఈమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో..! ఇక అజయ్ దేవగన్ కూడా తొలిసారి తెలుగు మూవీలో నటిస్తున్నారు. ఈయన పాత్ర సినిమాలో ఎందుకు ఉంది. హీరోలతో ఈయనకి కాంబినేషనల్ సీన్స్ లేవు. మరి ఈయన పాత్ర ఎలా కీలకం అనేది కూడా ఆసక్తిని పెంచే అంశం.

7) కీరవాణి : ‘బాహుబలి’ కి ఈయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటికీ మరచిపోలేము.ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఏ రేంజ్లో ఇచ్చి ఉంటాడో. రాజమౌళి క్యారీ చేసే ఎమోషన్ కు.. తగ్గ కీరవాణి అందించే నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గదు.

8) కె.కె.సెంథిల్ కుమార్ : ఈయన సినిమాటోగ్రఫీ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్ కు పెద్ద పీట వేశారు. కాబట్టి సెంథిల్ కూడా తెరవెనుక హీరో అనే చెప్పాలి.

9) పులి- ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశం హైలెట్ గా ఉంటుందట. అది ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.

10) ఇంటర్వెల్ సీక్వెన్స్ టాప్ నాచ్ అనే విధంగా ఉంటుందట. చరణ్- ఎన్టీఆర్ మధ్య కూడా ఓ ఫైట్ ఉంటుందని ఆ ఫైట్ వచ్చేప్పుడు ప్రేక్షకులంతా ఎమోషనల్ అవుతారని చిత్ర యూనిట్ సభ్యులు లీక్ చేశారు. అవి కూడా ఆసక్తిని పెంచే అంశాలే.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus