‘దాన వీర శూర కర్ణ’ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశారు అన్న సంగతి తెలిసిందే. అంతటి పెద్ద సినిమాలో ఆయన అన్ని పాత్రలు చేస్తూ కూడా డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు నటులు అన్నవాళ్ళు డైరెక్షన్ చేయగలరా? టేక్ 1,2,3 అనగానే యాక్షన్ మొదలుపెట్టి.. ప్యాకప్ ఎప్పుడు చెబుతారా చూసే నటులే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. నటించడం కష్టమే కానీ డైరెక్షన్ చేయడం ఇంకా కష్టం. 24 క్రాఫ్ట్స్ లోనూ ఇన్వాల్వ్ అవ్వాలి. సినిమా ఫలితం ఎలా ఉన్నా డైరెక్షన్ కనుక బాగోకపోతే ఎవ్వరూ నమ్మరు. తాజాగా వచ్చిన ‘కాంతారా’ అనే కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. ఇప్పుడు రిషబ్, గతంలో సీనియర్ ఎన్టీఆర్ లానే కొంతమంది నటులు దర్శకత్వం కూడా వహించారు. ఇప్పటి జెనెరేషన్లో కూడా కొంతమంది నటులు డైరెక్టర్స్ గా మారి తమ సత్తా చాటుతున్నారు. కొంతమంది తమ సినిమాలకే దర్శకత్వం వహిస్తే మరికొంత మంది పక్క సినిమాలకు కూడా డైరెక్టర్లుగా వ్యవహరించారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) రిషబ్ శెట్టి :
ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ను ఓ ఆట ఆడుకుంటున్న ‘కాంతారా'(కన్నడ) సినిమా హీరో గురించి చెప్పుకుందాం. ఏం నటించాడు. అలాగే ఏం డైరెక్ట్ చేశాడు సినిమాని..! సూపర్ అంతే..!
2) రక్షిత్ శెట్టి :
రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి కూడా ‘ఉలిదవరు కందంతే’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘రిచర్డ్ ఆంథోనీ’ అనే చిత్రాన్ని కూడా తనే డైరెక్ట్ చేయబోతున్నాడు.
3) ధనుష్ :
‘పా పండి’ అనే చిత్రాన్ని ధనుష్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ధనుష్ కూడా నటించాడు.
4) రాజ్ బి శెట్టి :
‘ఒండు మొట్టేయ కథ’ ‘గరుడ గమన వృషభ వాహన’ వంటి చిత్రాలను ఈ కన్నడ నటుడు నటించి, డైరెక్ట్ చేశాడు.
5) విశ్వక్ సేన్ :
ఫలక్ నుమా దాస్ అనే చిత్రాన్ని ఇతనే డైరెక్ట్ చేశాడు. అందులో హీరోగా కూడా నటించాడు.
6) మాధవన్ :
‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’ అనే చిత్రాన్ని మాధవన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు.
7) అడివి శేష్ :
‘కర్మ’ ‘కిస్’ వంటి చిత్రాలను అడివి శేష్ డైరెక్ట్ చేశాడు. అలాగే ఈ సినిమాల్లో అతను హీరోగా కూడా నటించాడు.
8) పవన్ కళ్యాణ్ :
‘జానీ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసింది మన పవర్ స్టారే. ఆ సినిమాలో హీరోగా కూడా నటించింది ఆయనే..!
9) విశాల్ :
‘తుప్పరివాలన్2′(డిటెక్టివ్ 2) అనే చిత్రాన్ని విశాల్ డైరెక్ట్ చేయబోతున్నాడు.
10) పృథ్వీరాజ్ సుకుమారన్ :
‘లూసిఫర్’ అనే చిత్రాన్ని ఇతను ఎంత మాస్ గా తీసాడో మనం చూశాం. ఇందులో అతను కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.