2023 లో 1 మిలియన్ వసూలు చేసిన టాలీవుడ్ సినిమాలు ఇవేనా…!

మన టాలీవుడ్ కి అతి పెద్ద మార్కెట్ ఏదైనా ఉందా అంటే అది ఓవర్సీస్ మార్కెట్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు ఏంటో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మొదటి రోజు నుండి బాక్సాఫీస్ కలెక్షన్స్ దుమ్ము దులిపింది. ఈ సినిమా యూఎస్‌లో 2.34 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘దసరా’ అమెరికాలో ఈ 2.09 మిలియన్ డాలర్ల మార్కును చేరింది.

రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్. రాఘవ గా ప్రభాస్, జానకి గా కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ఆదిపురుష్ యుఎఏ లో 1.95 మిలియన్ కలెక్షన్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఖుషి”. యూఎస్ లో 1.08 మిలియన్ వసూలు చేసింది. నవీన్ పొలిశెట్టి మరియు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ..ఈ సినిమా యూఎస్ లో 1.74 (రన్నింగ్) మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం “బ్రో ది అవతార్”. ఈ చిత్రంలో యూఎస్ మార్కెట్ లో 1.43మిలియన్ డాలర్లు వసూలు రాబడింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్ట్ 10 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం యూఎస్ లో 1.4 మిలియన్ పైగా కలెక్టన్స్ సాధించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించిన”విరూపాక్ష”. ఈ చిత్రంలో యూఎస్ లో 1.28 మిలియన్ డాలర్లు సాధించింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వచ్చిన వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో యూఎస్ లో 1.1 మిలియన్ వసూలు సాధించింది. హీరో శ్రీవిష్ణు హీరోగా హీరోయిన్ రెబా మోనికా హీరోయిన్ గా తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం “సామజవరగమన”. ఈ సినిమా యూఎస్ లో 1.03 మిలియన్ డాలర్లు సాధించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus