Mirchi: 11 ఏళ్ళ ‘మిర్చి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

  • February 9, 2024 / 01:43 PM IST

‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్లో ఉన్న ప్రభాస్ రెబల్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన రోజులు అవి. ఆ టైంలో ఓ కొత్త దర్శకుడితో ‘మిర్చి’ అనే సినిమా ప్రభాస్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినా.. ఆ ప్రాజెక్టు పై హైప్ ఏర్పడలేదు. అయితే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయ్యిందో.. అప్పటి నుండి ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అనే చెప్పాలి. నేటితో ‘మిర్చి’ సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సినిమా ప్రభాస్ కి చాలా స్పెషల్ మూవీ. అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. నదియా ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ‘యువీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ముందుగా ‘మిర్చి’ కథని దర్శకుడు కొరటాల శివ.. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాత అయిన అనిల్ సుంకరకి వినిపించారు. అయితే తాను ఆల్రెడీ నిర్మించిన ‘బిందాస్’ కి ‘మిర్చి’ కథ దగ్గరగా ఉందని భావించి ఆయన వద్దన్నారట.తర్వాత ఈ కథని ‘యూవీ క్రియేషన్స్’ నిర్మాతలు అయిన వంశీ, ప్రమోద్ లకి వినిపించాడు కొరటాల శివ.వాళ్ళు కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని రెడీ అవుతున్న టైం అది. ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు.

2) హీరో ప్రభాస్ ‘మిర్చి’ కథకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి తన ప్రాజెక్టుకి టైం పడుతుంది.. ముందు ‘మిర్చి’ చేసి రమ్మని చెప్పడంతో ప్రభాస్ ఓకే చెప్పాడు.

3) ‘మిర్చి’ సినిమాకి ముందుగా ‘వారధి’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ తర్వాత మాస్ అప్పీల్ ఉండాలని ‘మిర్చి’ గా మార్చారు.

4) ‘మిర్చి’ టైటిల్ ఇది వరకే మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించారు.

5) హేమంబర్ జాస్తి అనే కో డైరెక్టర్ ను .. డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘మిర్చి’ అనే సినిమా రూపొందించాలి అనుకున్నారు.’శ్రీ దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.ఎల్.నారాయణ్ ఈ ప్రాజెక్టుని నిర్మించాలి. కానీ అది ఆగిపోయింది. అయితే ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ వారి అడ్వాన్స్ మహేష్ బాబు వద్ద ఉండటంతో.. ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్టుకి పని చేసే ఛాన్స్ ఆయనకు దక్కింది. ‘మిర్చి’ టైటిల్ ను ప్రభాస్ – కొరటాల మూవీ టీంకి ఇవ్వడం జరిగింది.

6) ‘మిర్చి’ సినిమాలో సత్య రాజ్ పాత్రకి మొదట ప్రకాష్ రాజ్ ను అనుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ బిజీగా ఉండటంతో ఆ ఛాన్స్ సత్య రాజ్ కి దక్కింది.

7) మొదట ‘మిర్చి’ సినిమాకి వేరే సంగీత దర్శకుడిని అనుకున్నారు. కానీ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ ని ఫైనల్ చేశారు. అతను ఈ సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ‘ఇదేదో బాగుందే’ ‘డార్లింగే’ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

8) 2013 ఫిబ్రవరి 8 న ‘మిర్చి’ సినిమా రిలీజ్ అయ్యింది. ముందుగా అదే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ‘నాయక్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలు ఉండటంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

9) ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో రిలీజ్ అయినా ‘మిర్చి’ బాక్సాఫీస్ వద్ద రూ.48 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫిబ్రవరి నెలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. 2021 లో వచ్చిన ‘ఉప్పెన’ .. ‘మిర్చి’ రికార్డులని బ్రేక్ చేసింది.

10) 50 రోజులు, 100 రోజుల సినిమాలకి కాలం చెల్లిపోయింది అనుకునే రోజుల్లో కూడా.. 238 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది (Mirchi) ‘మిర్చి’ సినిమా..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus