Nandamuri Kalyan Ram: కొత్త సినిమా కోసం కల్యాణ్‌ రామ్‌ మీద భారీ ఖర్చు.. ఏం చేశారంటే?

‘బింబిసార’ (Bimbisara) సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కినట్లు కనిపించిన కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) ఆ తర్వాత చేసిన రెండు సినిమాలతో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. అలా అని రెండు సినిమాలూ నిరాశపరిచాయా అంటే లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న కొత్త సినిమాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా విజయం కల్యాణ్‌ రామ్‌కి అత్యవసరం అని అంటుంటే.. సినిమా గురించి వస్తున్న అప్‌డేట్స్‌ వింటుంటే.. ఈ సినిమా విజయం పక్కా అని అంటున్నారు. అలానే భారీగానే ఖర్చు పెడుతున్నారు అని కూడా చెబుతున్నారు.

ఈ క్రమంలో సినిమాలో ఓ యాక్షన్‌ సన్నివేశం కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టారు అని వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఆ సీన్‌ కోసం వెయ్యి మంది ఫైటర్లు పాల్గొన్నారు అని అంటున్నారు. దీంతో ఈ విషయం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. కల్యాణ్‌రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ ( Saiee Manjrekar) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి(Vijayashanthi), శ్రీకాంత్‌ (Srikanth)  ముఖ్య పాత్రధారులు.

ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకణ పూర్తయిందిట. బ్రహ్మ కడలి నేతృత్వంలో హైదరాబాద్‌ శివార్లలో రూపొందించిన ఓ భారీ సెట్‌లో నెల రోజుల పాటు యాక్షన్‌ చిత్రీకరించారట. దాదాపు 1000 మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారట. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ రామకృష్ణ నేతృత్వంలో రూపొందిన ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం రూ. ఎనిమిది కోట్లు ఖర్చు చేసినట్లు చిత్ర వర్గాలే తెలిపాయి.

యాక్షన్‌ ప్రాధాన్యమున్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ కొత్త లుక్‌తో కనిపించనున్నాడు. పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది అని కూడా అంటున్నారు. ఇక కల్యాణ్‌ రామ్‌ సోదరిగా విజయశాంతి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె వైజయంతీ ఐపీఎస్‌ అనే క్యారెక్టర్‌ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus