Rashmika: లేడీ సూపర్ స్టార్లకు సైతం దక్కని ఆఫర్ అందుకున్న రష్మిక!

రష్మిక మందన (Rashmika Mandanna) … కన్నడ, తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా ఆమె స్టార్ హీరోయిన్. ముఖ్యంగా హిందీలో రష్మిక అంటే ‘నేషనల్ క్రష్’ గా భావిస్తూ ఉంటారు. ”భీష్మ’ తర్వాత రష్మిక పని అయిపోయింది’ అని అంతా అనుకున్నారు. కానీ అదే టైంలో ‘పుష్ప’ వచ్చి ఆమెను ఆడుకుంది. తర్వాత రెండు, మూడు సినిమాలకి ఒక పెద్ద హిట్టు కొడుతూ.. కొత్త హీరోయిన్ల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటుంది. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ‘యానిమల్’ (Animal) ‘చావా’ (Chhaava) వంటి పెద్ద హిట్లు రష్మిక ఖాతాలో పడటంతో ఆమె డిమాండ్ మరింతగా పెరిగింది అని చెప్పాలి.

Rashmika

ప్రస్తుతం ఆమె ‘కుబేర’ (Kubera) ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే సల్మాన్ ఖాన్ తో (Salman Khan) చేసిన ‘సికందర్’ (Sikandar) కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇదిలా ఉండగా.. రష్మికతో రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టి ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ చేయాలని ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భావిస్తోందట. సాధారణంగా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు రూ.10 కోట్ల బడ్జెట్లోనే చేస్తుంటారు.

అందులో రూ.3 కోట్లు, రూ.4 కోట్లు వంటివి హీరోయిన్ కి రెమ్యూనరేషన్ గా ఇచ్చినా.. మిగతా బడ్జెట్ ని మేకింగ్ కి వాడతారు. ఒకవేళ అనుష్క (Anushka Shetty), నయనతార (Nayanthara) వంటి సూపర్ స్టార్లతో సినిమాలు అంటే రూ.30 కోట్ల వరకు పెట్టడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. కానీ రష్మిక తో ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయాలి అనుకోవడం అనేది చిన్న విషయం కాదు.

రష్మిక ఖాతాలో పెద్ద హిట్లు ఉన్నాయి అంటే అది పూర్తిగా స్టార్ హీరోల స్టామినా..! మంచి కథ ఉన్నా స్టార్ హీరో లేకుండా రష్మిక పెద్ద హిట్లు కొట్టిన సందర్భాలు లేవు. మరి సదరు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్.. ఏ ఉద్దేశంతో రశ్మికతో సినిమా చేయాలని అనుకుంటుందో.. అంత బడ్జెట్ రష్మిక పై పెట్టి.. రికవరీ చేసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేసిందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus