Radhe Shyam Movie: ‘రాధే శ్యామ్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో జూలై నెల ఆరంభం నుండీ ప్రారంభించనున్నారు అని వినికిడి. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు.కాబట్టి..

అతి త్వరలో ఈ చిత్రం ఫైనల్ కాపీ కూడా రెడీ అయ్యే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ఇక గత కొద్దిరోజులుగా ఈ చిత్రం నుండీ రకరకాల వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రంలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని మొన్నటికి మొన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ‘రాధే శ్యామ్’ పై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది.ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మొత్తం 26 సెట్టింగులు కనిపిస్తాయట. వాటి కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసారని వినికిడి.

కేవలం ఈ సెట్ ల కోసమే నిర్మాతలు ఏకంగా 100 కోట్లకు పైగా ఖర్చు చేసారని తెలుస్తుంది. ఒక ప్రేమ కథ కోసమే నిర్మాతలు ఇంత భారీగా ఖర్చు చేసారు అంటే నమ్మడం కొంచెం కష్టంగా అనిపించినా… ఇది నిజం, అని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు.ఇదిలా ఉండగా.. మరో పక్క ఈ చిత్రం నుండీ ఫస్ట్ సింగిల్ కూడా అతి త్వరలో విడుదల కాబోతుందనే ప్రచారం కూడా మొదలైంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కు సంగీతం అందిస్తుండడం విశేషం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus