OTT ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక, ప్రేక్షకుల థియేటర్ కు వచ్చే సంస్కృతి చాలా వరకు తగ్గుతూ వస్తుంది. అయితే దీనికి కేవలం OTT మాత్రమే కారణమా అంటే థియేటర్లో విడుదలైన మూవీ 30 రోజులు తిరగకముందే ఇంట్లోకి వచ్చేస్తుంది అనే అభిప్రాయంలోకి వచ్చేసారు ఆడియన్స్. దీంతో పాటు, భారీ బడ్జెట్లతొ సినిమాలు నిర్మించటం ఆ ఖర్చును రికవర్ చేసుకోవడానికి నిర్మాతలు టికెట్ రేట్లను భారీగా పెంచేస్తుండటం, అక్కడికి వెళ్లాక తినుబండారాల రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో, థియేటర్లు వైపు చూడటమే మానేశారు చాలా మంది ఆడియన్స్. దీంతో పెద్ద సినిమాలలాగ కాకుండా చిన్న సినిమాలు, సినిమా రిలీజ్ కు ముందే ఆఫర్లు ప్రకటిస్తూ ఆడియన్స్ ని థియేటర్ల వైపు తిప్పే పనిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ శుక్రవారం విడుదల కానున్న ఒక సినిమా మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్ ప్రకటన చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూసేద్దాం రండి.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా రేపు అనగా జనవరి 30న విడుదలకు సిద్దమైన చిత్రం ‘ఓం శాంతి శాంతి’ . ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ పెళ్లి అయిన జంటలకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. మ్యారేజ్ అయ్యి జంటగా వెళ్లేవారికి 1+1 టికెట్ ఆఫర్ ను పోస్ట్ చేసారు. అంటే ఒక టికెట్ కొనుకొని జంటగా వెళ్లొచ్చు అన్నమాట. ఇప్పటికే ఈ సినిమా టికెట్ రేట్లు కూడా ఆడియన్స్ కి అందుబాటులో ఉండేలా సింగిల్ స్క్రీన్స్ లో 99/-, మల్టీఫ్లెక్ లలో 150/- గా నిర్ణయించారు. ఇప్పుడు ఈ 1+1 ఆఫర్ తో మరింత మంది ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారని మేకర్స్ ఆలోచన.
ఇది ఇలా ఉండగా, ఈ రోజు (జనవరి 29)న సెలెక్ట్ చేసిన ఏరియాలలో ఈ మూవీ ప్రీమియర్స్ ప్లాన్ చేసారు నిర్మాతలు. రీమేక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.