సినిమా అంటే పాటలు.. ఫైట్స్ మాత్రమే కాదు. జీవిత పాఠాలు చెప్పే టీచర్స్. రెండున్నరగంటల పాటు మనల్ని ఎంటర్ టైన్ చేసి అమూల్యమైన సందేశాన్ని అందిస్తాయి. అలాంటి తెలుగుచిత్రాల్లో కొన్నింటి గురించి.. అవి చెప్పిన జీవిత సత్యాలపై ఫోకస్..
నేడు ఒప్పు.. రేపు తప్పు (కొత్త బంగారులోకం) ఇవాళ రాంగ్ అనుకున్నది.. రేపు రైట్ అవ్వొచ్చు. ఇవాళ రైట్ అనిపించింది రేపు రాంగ్ అనిపించొచ్చు.
విలువలే ఆస్తి (సన్నాఫ్ సత్యమూర్తి )మన నాన్న నుంచి మనం తీసుకోవాల్సింది ఆస్తి కాదు.. విలువలు. విలువలు ఉంటే మనకన్నా ధనవంతుడు ఇంకెవరు ఉండరు.
విలువైన స్నేహం (హ్యాపీడేస్) కాలేజీ లైఫ్ కి కెరీర్ కి బ్రిడ్జి ఎలా వేసుకోవాలో చెప్పిన సినిమా హ్యాపీడేస్. ఫ్రెండ్స్ ని ఎలా ఏర్పరుచుకోవాలో.. వారిని ఎలా కాపాడుకోవాలో తెలిపిన చిత్రం.
ఈజీ మని వద్దురా (జులాయి)ఈజీగా వచ్చే డబ్బులు చిక్కులు కూడా ఎన్నో తెస్తాయి.
మతం మనుషుల సృష్టి (గోపాల గోపాల )దొంగ బాబాలను, స్వామీజీలను నమ్మి మోసపోవద్దని చెప్పిన సినిమా గోపాల గోపాల. మతం మనుషుల సృష్టి అని చాటిన మూవీ ఇది.
అమ్మ ప్రేమ అమూల్యం (అమ్మ చెప్పింది) నువ్వు ఎలా ఉన్నా ప్రేమించే, నీ కోసం తపించే ప్రాణం అమ్మ.
మనతోనే మార్పు (లీడర్) నాయకుడు మనలో నుంచి పుట్టాలి. మార్పు మనతోనే మొదలవ్వాలి.
చెడపకురా చెడేవు (దొంగాట) నమ్మిన వాళ్ళను మోసం చేస్తే మోసపోయేది మనమే.
సామాన్యుడు చేతకాని వాడు కాడు (ఈనాడు) సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కామన్ మ్యాన్ ఎంత పెద్ద వ్యవస్థనైనా పరుగులు పెట్టించగలడు.
పైసానే సర్వస్వం కాదు (ఎవడే సుబ్రహ్మణ్యం)జీవితంలో డబ్బు ఒక్కటే సర్వస్వం కాదు. ఆత్మ మధనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి.
మంచి లోనే దేవుడు (ఖలేజా) దేవుడు అనే వాడు ఏ విగ్రహం లోను, గుడిలోనూ కాదు..మనం చేసే మంచి పనిలో ఉంటాడు.
స్వచ్ఛమైన ప్రేమ (నువ్వొస్తానంటే వద్దంటానా )స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఎంతదూరమైనా వెళ్లి సాధించవచ్చు.