Aha Naa Pellanta: అహ నా పెళ్ళంట సీరీస్ కచ్చితంగా చూడటానికి గల 12 కారణాలు!

  • November 18, 2022 / 10:51 AM IST

ఈ మధ్య కాలంలో ఓటీటీలు థియేటర్లను కూడా డామినేట్ చేసేస్తున్నాయి. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే తప్ప జనాలు థియేటర్లకు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఓటీటీల్లోనే స్ట్రాంగ్ కంటెంట్ లభిస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ గురించి చెప్పుకోవచ్చు. రాజ్ తరుణ్ , శివాని రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సిరీస్ ఇది. టీజర్, ట్రైలర్ లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.నవంబర్ 17 న అంటే ఈరోజు అర్ధరాత్రి నుండి ఈ వెబ్ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తమడా మీడియా, జీ5 సంస్థల పై రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా లు కలిసి ఈ సీరీస్ ను నిర్మించారు. సంజీవ్ రెడ్డి ఈ సీరీస్ కు దర్శకుడు. 8 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సీరీస్ కచ్చితంగా చూడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని ఓ లుక్కేద్దాం రండి:

1) టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. వాటిలో చూపించినట్టే సిరీస్ లో హిలేరియస్ ఫన్ ఉంది.

2) కాన్సెప్ట్ కూడా సింపుల్ గా బాగుంది. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఈ సిరీస్ ను తెరకెక్కించాడు. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా బాగా కుదిరింది.

3) హీరో రాజ్ తరుణ్.. ఈ సిరీస్ లో చాలా బాగా నటించాడు.కెరీర్ ప్రారంభంలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మవ లో ఎంత ఎనర్జిటిక్ గా కనిపించాడో.. సినిమాలో కూడా అదే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పొచ్చు.

4) శివానీ రాజశేఖర్ క్యూట్ లుక్స్ కూడా యూత్ ను కట్టిపడేస్తాయి. నటన పరంగా కూడా ఆమె ఆమె పలికించిన హావభావాలు మెప్పిస్తాయి.

5) రాజ్ తరుణ్ – శివాని రాజశేఖర్ ల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళ పెయిర్ బాగుంది. నిజజీవితంలో కూడా వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి.. ఇబ్బంది పడకుండా చక్కగా నటించారు.




6) ఆమని అమాయకపు తల్లి పాత్రలో చక్కగా నటించింది. ఈ పాత్ర కూడా చాలా స్పెషల్ అని చెప్పాలి.

7) హర్ష వర్ధన్ కామెడీ టైమింగ్ మామూలుగా లేదు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా జీవించేసాడు. ఓ రకంగా నొ బాల్ నారాయణ పాత్రలో ఈయన్ని తప్ప వేరే నటుడిని ఊహించలేము.





8) బాల పాత్రలో త్రిశూల్, దాస్ పాత్ర పోషించిన రవి శివ తేజ ల కామెడీ హైలెట్ అని చెప్పొచ్చు. అలాగే తాగుబోతు రమేష్, పోసాని, గెటప్ శ్రీను ల పాత్రలు కూడా అక్కడక్కడా నవ్వులు పూయిస్తాయి.

 

9) జుడా శాండీ సంగీతం & నగేష్ బ్యానిల్ – అస్కర్ అలీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నాయి





10) కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ కూడా యూత్ ను ఫ్యామిలీస్ ను ఆకట్టుకుంటాయి.

11) మరీ ముఖ్యంగా తమడా మీడియా వారి నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుల్, సాయి దీప్ లు ఎక్కడా కూడా వాటి విషయంలో రాజీ పడలేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. ఈ నిర్మాతలతో వెంటనే మరో ప్రాజెక్టు చేయడానికి రెడీ అని హీరో రాజ్ తరుణ్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఫీలయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉండి ఉంటుంది. కానీ ఈ సిరీస్ చూశాక అందరి అభిప్రాయం మారుతుంది.





12) పాటలు కూడా సిట్యుయేషన్ కు తగ్గినట్టు ఉన్నాయి. ఓవరాల్ గా అందమైన, ఆహ్లాదకరమైన సీరీస్ ఇది అని చెప్పొచ్చు. జీ5 లో అందుబాటులో ఉంది. వెంటనే ఓ లుక్కేయండి :

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus