సినిమా షూటింగ్ల టైంలో హీరోలకి గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ టైంలో అయితే మరీను. రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం అంటే అక్టోబర్ 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. స్టువర్ట్ పురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఈ మూవీ తెరకెక్కుతుంది. టీజర్, ట్రైలర్లు బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ మేకోవర్ కొత్తగా ఉంది.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు వావ్ అనే విధంగా ఉంటాయని వినికిడి. ఇది పక్కన పెడితే.. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా రవితేజ ప్రమాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాదు లెండి.. ఇది జరిగి చాలా రోజులు పూర్తయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ట్రైన్ దోపిడీ సీన్ ఒకటి ఉంటుందట. ఈ సీన్ చిత్రీకరణ టైంలో ట్రైన్ పై నుండి లోపలికి దూకే షాట్ ఒకటి ఉంటుందట.
ఆ షాట్ లో రవితేజ (Ravi Teja) బ్యాలన్స్ తప్పి కింద పడిపోయాడట. ఈ క్రమంలో మోకాలికి కొద్దిగా పైన అతనికి పెద్ద దెబ్బ తగిలినట్టు నిర్మాత తెలిపారు.తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లగా సర్జరీలో భాగంగా వైద్యులు రవితేజకి 12 కుట్లు వేసినట్టు నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. రవితేజ కాబట్టి అలాంటి రిస్క్ లు చేయడం, అదే టైంలో షూటింగ్ ఆగిపోకుండా సహాయపడటం వంటివి చేసారని కూడా ప్రశంసలు కురిపించారు అభిషేక్.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు