దర్శకుడు తేజ చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు. అయితే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు ఆయన్ని ఆయన మార్చుకోలేక ఆయనకు సక్సెస్ దూరం అయ్యిందో, లేకపోతే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకోవడం వల్ల తేజ సినిమాలో పాత బడ్డాయో తెలీదు కానీ, అప్పట్లో ఒక ఊపు ఊపిన తేజ ఎంతో మంది హీరో, హీరోయిన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇక వారిలో కొందరు చిత్ర పరిశ్రంలో టాప్ స్థానంలో దూసుకుపోతున్నారు. మరి తేజ ఇంట్రొడ్యూస్ చేసిన వారిలో కొందరిని ఒక లుక్ వేద్దాం రండి…
చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
నువ్వు నేను సినిమాలో సునీల్ కు మంచి బ్రేక్ ఇచ్చాడు తేజ. ఆ చిత్రంలో “నువ్వు యూత్ ఏంట్రా” అనే డైలాగ్ ఇప్పటికీ కుర్రకారు వాడుతున్నారు అంటే ఆది తేజ క్రెడిట్ అనే చెప్పాలి.
చిత్రం సినిమా ద్వారా ఆర్పీ కు బ్రేక్ ఇచ్చింది తేజనే.
“చిత్రం” చిత్రం ద్వారా గాయని ఉషకు మంచి అవకాశాన్ని అందించాడు తేజ. ఇక ఆ సినిమాలో ఆమె పాటకు ప్రేక్షక దేవుళ్ళు ముగ్దులవడంతో ఆమె టాప్ సింగర్ గా మారిపోయి ఎన్నో అద్భుతమైన పాటలను పాడుతుంది.
యువ హీరో నితిన్ సైతం తేజ దర్శకత్వంలో వచ్చిన జయం చిత్రం ద్వారా తెలుగు తెరపై తన మార్క్ ను ముద్రించాడు.
బబ్బ్లీ బ్యూటీ అనితా కూడా నువ్వు నేను చిత్రం ద్వారానే తేజ దర్శకత్వంలో పరిచయం అయ్యింది.
అందాల బామ సదా సైతం తెలుగు తెరకు పరిచయం అయ్యింది జయం చిత్రం ద్వారానే. తేజ దర్శకత్వంలో
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మి కళ్యాణం” చిత్రంతోనే అందాల భామ కాజల్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
కమీడియన్, సునీల్ షెట్టి ని కూడా తేజ జయం చిత్రం ద్వారా పరిచయం చేశాడు.
నితిన్ హీరోగా తేజ తెరకెక్కించిన ధైర్యం చిత్రంలో రైమ సేన్ కు బ్రేక్ ఇచ్చాడు తేజ.
యువ హీరో నవదీప్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన తేజ. అతన్ని జై సినిమాతో ఇంట్రొడ్యూస్ చెయ్యడం జరిగింది.
అందాల భామ నందితని, నీకు నాకు చిత్రంతో తెలుగు వారికి పరిచయం చేశాడు.
పొడుగ్ కాళ్ళ హీరో ప్రిన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది తేజనే, నీకు నాకు సినిమాతో.
ఇలా ఎందరో యువ హీరోల్ని, కమీడియన్స్ ని, హీరోయిన్స్ ని తేజ తెలుగు తెరకు పరిచయం చేశాడు.