హీరోయిన్స్ అందమైన మాటల వెనుకున్నది వీరే

తెలుగు తెరపై హీరోయిన్స్ తమ అందం, అభినయంతో ఆకట్టుకుంటారు. ఎంతో చక్కగా డైలాగులు పలికి మెప్పిస్తారు. అయితే కొంతమంది తారల స్వీట్ వాయిస్ వెనుక మరొకరి కష్టం దాగుంది. హీరోయిన్స్ నటించిన పద్ధతిని బట్టి.. డబ్బింగ్ ఆర్టిస్టులు.. కవ్విస్తారు.. నవ్విస్తారు.. ఏడిపిస్తారు. హీరోయిన్స్ బాడీ ల్యాంగ్వేజ్ కి అనుగుణంగా డబ్బింగ్ (నటించి) చెప్పి అలరిస్తారు. అందుకే వారిని కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులు అని చెప్పకుండా తెర వెనుక హీరోయిన్స్ గా గౌరవిస్తున్నాం. వీరిలో హీరోయిన్ గా నటించిన వారు కూడా ఉండడం విశేషం. హీరోయిన్స్ గా గౌరవం అందుకునేలా సూపర్ గా డబ్బింగ్ చెప్పిన వారెవరంటే..

టీజీ కమల దేవి (పద్మిని, బి.సరోజాదేవి)
ఎస్ పీ శైలజ (శ్రీదేవి, సోనాలి బింద్రే, టబు )
రోజా రమణి ( మీనా, శిల్పా శెట్టి )
సునీత ఉపద్రష్ట (నయనతార, కత్రినా, తమన్నా)
చిన్మయి శ్రీపాద ( సమంత, లావణ్య, పూజ హెగ్డే )
సౌమ్య శర్మ ( కాజల్, అమలా పాల్ )
హరిత ( ఇలియానా, మాధవీ లత )
సరిత ( సౌందర్య, రమ్యకృష్ణ, నగ్మా)
సవిత రెడ్డి ( త్రిష, జెనీలియా )
స్వాతి రెడ్డి (ఇలియానా )
శ్రావణ భార్గవి (శృతి హాసన్ )
వీణ ఘంటశాల (జెనీలియా, ఆదా శర్మ, కంగనా రనౌత్ )
ఛార్మి (కాజల్ )
లిప్సిక (మెహ్రీన్, హెబ్బా పటేల్, సాయేషా)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus