టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్ అనిపించుకున్న 14 జంటలు ఎవరంటే..!

తెరమీద కనిపించే హీరో హీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉండాలి.. తెలుగు పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన నటీనటులకు అధిక ప్రాధాన్యమిస్తుంటారనే విషయం తెలిసిందే.. ఒకసారి జతకట్టి అలరిస్తే.. ఇక ఆ యాక్టర్స్ పెయిర్ రిపీట్ అవుతూ ఉంటుంది.. ఇటీవలి కాలంలో ఫస్ట్ టైమ్ కలిసి నటించి.. ఆడియన్స్ చేత బెస్ట్ పెయిర్ అనిపించుకున్న 13 జంటల గురించి ఇప్పుడు చూద్దాం..

1. వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి..

‘ఉప్పెన’ తో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి ఇద్దరూ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు.. మూవీ అంత పెద్ద విజయం సాధించిందంటే అందులో వీళ్ల పెయిర్ మెయిన్ రీజన్..

2. నాగ చైతన్య – సాయి పల్లవి..

యువ సామ్రాట్ నాగ చైతన్య.. టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.. వెరీ గుడ్ డ్యాన్సర్ సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ లో నటించారు. ఇద్దరి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయింది..

3. శ్రీ విష్ణు – సునయన..

తెరపై భార్యా భర్తల్లా కనిపించడం అంటే కెమిస్ట్రీ కుదరాలి.. ‘రాజ రాజ చోర’ మూవీలో శ్రీ విష్ణు పక్కన సునయన ఇదే మ్యాజిక్ చేసింది..

4. రోషన్ – శ్రీలీల..

‘పెళ్లి సందD’ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అంత మంచి విజయం సాధించిందంటే దానికి ఏకైక కారణం కీరవాణి సాంగ్స్.. హీరో రోషన్ అండ్ హీరోయిన్ శ్రీలల మధ్య కెమిస్ట్రీనే..

5. అఖిల్ – పూజా హెగ్డే..

అఖిల్ – పూజా హెగ్డే కాంబినేషన్ అనౌన్స్ చేసినపుడు విమర్శలు వచ్చాయి కానీ సినిమా చూసిన తర్వాత స్క్రీ‌న్ మీద చాలా ఫ్రెష్‌గా అనిపించింది వీరి జంట..

6. నాగ శౌర్య – రీతూ వర్మ..

‘వరుడు కావలెను’ సినిమాలో నాగ శౌర్య – రీతూ వర్మ చాలా చక్కగా ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కవుట్ అయింది..

7. కిరణ్ అబ్బవరం – ప్రియాంక జవాల్కర్..

‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మూవీలో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం, తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ జంట ప్రేక్షకులను అలరించింది.. రొమాన్స్ కూడా అదిరిపోయింది.. సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్ ఇదే..

8. సుధీర్ బాబు – ఆనంది..

తెలుగమ్మాయి ఆనంది, సుధీర్ బాబు జంట ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంలో కనిపించి ఆకట్టుకున్నారు..

9. శర్వానంద్ – అదితి రావు హైదరీ..

ర్వానంద్ – అదితి రావు హైదరీ ఇద్దరూ ‘మహాసముద్రం’ సినిమాలో జోడీగా ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇచ్చారు..

10. నాగ చైతన్య – కృతి శెట్టి..

‘బంగార్రాజు’ లో మొదటిసారి కలిసి కనిపించిన నాగ చైతన్య – కృతి శెట్టి పెయిర్‌కి మంచి పేరొచ్చింది.. ఇప్పుడు ‘కస్టడీ’ అనే తమిళ్ – తెలుగు చిత్రంలో మరోసారి జతకడుతున్నారు..

11. నాగ శౌర్య – షెర్లీ సేథియా..

నాగ శౌర్య – షెర్లీ సేథియా జంట ‘కృష్ణ వ్రింద విహారి’ లో కనిపించి అలరించారు..

12. నాని – నజ్రియా నజీమ్..

బ్యూటిఫుల్ మలయాళీ యాక్ట్రెస్ నజ్రీయా నజీమ్.. నేచురల్ స్టార్ నాని జంటగా ‘అంటే సుందరానికి’ మూవీ చేశారు.
ఈ క్యూట్ కపుల్ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు..

13. విశ్వక్ సేన్ – రితిక నాయక్..

విశ్వక్ సేన్ – రితిక నాయక్.. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఫ్రెష్ కపుల్.. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీలో హీరోకి మరదలిగా కనిపించింది రితిక..

14. దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్..

ఈ సంవత్సరం సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో సూపర్ డూపర్ జోడీ.. దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్.. ‘సీతా రామం’ లో సీతా మహాలక్షీగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా మృణాల్.. సైనికుడిగా, ప్రేమికుడిగా దుల్కర్ జంట ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus