తొలి సినిమాతో గుర్తింపు పొందినా కనుమరుగైన హీరోయిన్స్

ఒక్క ఛాన్స్.. సినిమాలో తొలి అవకాశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకోసం చాలా కష్టపడతారు. వస్తే.. అంతకంటే ఎక్కువగా కష్టపడతారు. తమలోని ప్రతిభనంతా బయటపెడుతారు. విజయం వస్తే వరుసగా ఆఫర్లు వస్తాయి. ఇది అందరి విషయంలో జరగవు. ఎందుకంటే కొంతమంది హీరోయిన్స్ తొలి సినిమాలో బాగా నటించినప్పటికీ, విజయం అందుకున్నప్పటికీ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఇలా ఒకటి రెండు సినిమాల్లో కనిపించి కనుమరుగైన తారలపై ఫోకస్…

రిచా నువ్వేకావాలి సినిమాతో యువత మది దోచుకున్న రిచా.. తర్వాత కొన్ని సినిమాలు చేసినా పరిశ్రమలో ఉండలేకపోయింది.

అన్షు మన్మథుడు చిత్రంలో కాసేపు కనిపించినప్పటికీ అన్షు అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటించింది. తర్వాత కనబడకుండా పోయింది.

అనురాధ మెహతా అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. ఇందులో ఆర్య లవర్ గీతగా మెప్పించిన అనురాధ మెహతా తర్వాత కనిపించలేదు.

నేహా నితిన్ తో కలిసి దిల్ సినిమాతో అడుగుపెట్టి నేహా హిట్ అందుకుంది. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాలో చిన్న రోల్ చేసింది. ఇంకా చిన్న రోల్స్ లో కూడా కనబడలేదు.

రేణు దేశాయ్ బద్రి సినిమాతో రేణు దేశాయ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. జానీలోను కనిపించింది. ఆ తర్వాత తెర వెనుకే సెటిల్ అయింది.

భాను శ్రీ మెహ్రా వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భాను శ్రీ మెహ్రా ని చివరి వరకు చూపించలేదు. సినిమా రిలీజ్ అయినా తర్వాత ఆమెను ఎవరూ చూడాలనుకోలేదు. ఒక సినిమాతోనే ఆమె కనుమరుగైంది.

గౌరీ ముంజల్ బన్నీ సినిమాతో గౌరీ ముంజల్ అడుగుపెట్టింది. అల్లు అర్జున్ తో కలిసి మస్త్ గా స్టెప్పులు వేసింది. కానీ కెరీర్ లో మరో అడుగు వేయలేకపోయింది.

మీరా చోప్రా పవన్ కళ్యాణ్ పక్కన నటించే ఛాన్స్… లక్ అంటే మీరా చోప్రా దే అనుకున్నారు. కానీ సినిమా ఫెయిల్. ఐరన్ లెగ్ ని ముద్ర వేసి పక్కన పెట్టారు.

నేహా శర్మ మెగాస్టార్ తనయుడు చరణ్ తో కలిసి నేహా శర్మ వెండితెరకి పరిచయమైంది. గిలిగింతలు పెట్టింది. తర్వాత కొన్ని ఛాన్స్ అందుకున్నప్పటికీ నిలబడలేకపోయింది.

సియా గౌతమ్ నేనింతే సినిమాలో సియా గౌతమ్ ని పూరి జగన్నాథ్ పరిచయం చేశారు. అయినా సియా వేదం తర్వాత
ఎక్కడ కనిపించలేదు.

కార్తీక జోష్, దమ్ము సినిమాల్లో నటించిన కార్తీకకు తెలుగు పరిశ్రమలో అవకాశాలు కరువయ్యాయి. అందుకే ఆమె ఇటువైపు రాలేదు.

షామిలి బేబీ షామిలి అని అందరికి తెలుసు. హీరోయిన్ గాను మంచి పేరు తెచ్చుకుంటుందని అందరూ అనుకున్నారు. ఓయ్ అని పలకరించి తర్వాత కనిపించడం మానేసింది.

పాయల్ ఘోష్ విభిన్నమైన కథ ప్రయాణం లో పాయల్ ఘోష్ మెరిసింది. ఆ తర్వాత ప్రయాణం ఆపేసింది.

సారా జాన్ సారా జాన్ మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచింది. పంజాలో నటించి యువకుల మనసులు గెలుచుకుంది. తర్వాత వెనుతిరిగింది.

వీరందరూ కనుమరుగవడానికి అవకాశాలు రాకపోవడమే కారణం కాకపోవచ్చు. ఇతరత్రా కారణాల వల్ల కూడా వీరు కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఉండవచ్చు. ఏది ఏమైనా తళుక్కున మెరిసి మాయమయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus