ఎన్టీఆర్ గురించి మీకు తెలియని 15 సంగతులు

విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామా రావు ఆశీసులతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 15 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రీల్, రియల్ లైఫ్ కి సంబంధించి ఆసక్తికర సంగతులు..

1. జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామా రావు దర్శకత్వంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర (హింది) సినిమాలో బాల భరతగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కాలేదు.2. టాలీవుడ్ బాద్ షా నిన్నుచూడాలని చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి వచ్చిన మూడున్నర లక్షల రూపాయల పారితోషికాన్నిఅమ్మ చేతిలో పెట్టాడు.3.యంగ్ టైగర్ కూచిపూడిని నాలుగు ఏళ్ల పాటు నేర్చుకున్నారు. ఈ సాధన తాను సినిమాల్లో చక్కగా స్టెప్ లను వేయడానికి ఉపయోగ పడిందని కంత్రి పలు మార్లు చెప్పారు.4. ఆటల్లో క్రికెట్ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. సమయం దొరికితే బ్యాట్ పట్టి బంతికి పరుగులు నేర్పిస్తారు.5. అమ్మ వండి పెట్టే రొయ్యల బిర్యానీ ని ఫుల్లుగా లాగించడమే కాదు. గరిటె పట్టి చక్కగా వంట చేయగలరు. తీరిక వేళల్లో తన భార్య ప్రణతికి వండి పెడతారు.6. తొలిసారి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఆంధ్రావాలా సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

7. విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా షాపింగ్ చేస్తారు. ఇది వరకు తనకి నచ్చింది కొనేవారు. ఇప్పుడు తన కొడుకు అభయ్ రామ్ కోసం కొంటున్నారు. తనకంటే కొడుకు కోసమే ఎక్కువగా కొంటున్నారంట.8. తన సినిమా దర్శకులతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు పెద్ద కానుకలు ఇవ్వడం ఎన్టీఆర్ కి అలవాటు.9. ఎన్టీఆర్‌ పెద్దలను గౌరవిస్తుంటారు. తన గురువు జగ్గివాసుదేవ్‌ ని సద్గురు అని పిలుస్తుంటారు.10. ఎన్టీఆర్‌ మర్చిపోలేని రోజుగా మార్చి 26, 2009 ని చెబుతుంటారు. ఎందుకంటే ఆరోజు ఎన్టీఆర్‌ కారు ప్రమాదానికి గురయ్యారు. క్షేమంగా బయట పడటమే కాదు, ఆరోజు తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజూ కూడా.11. చిన్న రామయ్య నచ్చిన సినిమా ‘దాన వీర శూర కర్ణ’. అభిమాన హీరో మహా నటుడు తాతయ్య ఎన్టీఆర్‌. హీరోయిన్ శ్రీదేవి.

12. తన సినిమాల్లో హిట్ ఇచ్చిన సినిమాలకంటే సంతృప్తి ఇచ్చిన సినిమా “నాన్నకు ప్రేమతో” అంటేనే యమదొంగకి కొంచెం ఎక్కువ ఇష్టం.13. తారక్‌ ఫేవరట్ కలర్ వైట్. అతని లక్కీనెం.9. ఆయన కారు నెంబర్లలో అన్నీ తొమ్మిదిలే కనిపిస్తాయి.14. కీరవాణి స్వరపరిచిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటంటే సింహాద్రికి చాలా ఇష్టం. ఆ పాటని కీరవాణి ఎన్టీఆర్‌కి అంకితం ఇచ్చారు.

15. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత జపనీయులు ఎక్కువగా అభిమానించే సౌత్ ఇండియన్ సినీ స్టార్ ఎన్టీఆర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus