మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం నిన్న అంటే అక్టోబర్ 20 న రిలీజ్ అయ్యింది. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే నిడివి ఎక్కువైంది అనే కంప్లైంట్ ఉంది.
సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరోని నెగిటివ్ గా చూపించారు.. కాబట్టి సెకండ్ హాఫ్ లో పాజిటివ్ గా చూపించాలి అనే క్రమంలో ఎక్కువ సన్నివేశాలు పెట్టేసాడు దర్శకుడు. అవును సెకండ్ హాఫ్ లో చాలా అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయని అంతా అభిప్రాయపడ్డారు. పోటీగా రిలీజ్ అయిన ‘లియో’ కంటే కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ కి బెటర్ టాక్ వచ్చింది. అయినా ప్రేక్షకులు ఈ నిడివి చూసి టికెట్ బుక్ చేసుకోవడానికి భయపడినట్టు మేకర్స్ భావించారు.
అందుకోసం (Tiger Nageswara Rao) సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను కట్ చేసినట్టు తెలుస్తుంది. ముందుగా ఈ చిత్రం రన్ టైం 2 గంటల 52 నిమిషాలు ఉంది. అయితే ఇందులో 15 నిమిషాల భాగాన్ని ట్రిమ్ చేశారట. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ రన్ టైం 2 గంటల 37 నిమిషాలుగా ఉంది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వస్తారు. వాళ్ళను బోర్ కొట్టించకుండా ఉండటానికే.. చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!