గత వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క ‘లవ్ టుడే’ మాత్రమే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అల్లరి నరేష్ నుండి వచ్చిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ పర్వాలేదు అనిపించే టాక్ ను సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది. అయితే నవంబర్ అనేది అన్ సీజన్ అయినప్పటికీ.. ఈఏడాది నవంబర్లో ‘యశోద’ ‘గాలోడు’ ‘మాసూడ’ ‘లవ్ టుడే'(డబ్బింగ్) వంటి కమర్షియల్ హిట్స్ పడ్డాయి.నిజంగా ఇదొక విశేషంగానే చెప్పుకోవాలి. అయితే ఎక్కువ శాతం ప్రేక్షకులు ఓటీటీలకే ఓటేశారన్నది నిజం. ఇక డిసెంబర్ మొదటి వారంలో కూడా ఓటీటీలో సందడి చేసే సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ వీకెండ్ కు థియేటర్లో ‘హిట్2’ ‘మట్టీ కుస్తీ'(డబ్బింగ్) సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీలో బోలెడన్ని సినిమాలు/ వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇంటిల్లిపాది హ్యాపీగా రిలాక్స్ అవుతూ చూడదగ్గ ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) లవ్ టుడే :
గతవారం తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ‘లవ్ టుడే’ తమిళ వెర్షన్ ఈ వీకెండ్ నుండి అంటే డిసెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
2) జిన్నా :
మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్లుగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ మూవీ .. డిసెంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
3) రిపీట్ :
నవీన్ చంద్ర హీరోగా మధుబాల కీలక పాత్రలో తెరకెక్కిన ఈ మూవీకి అరవింద్ శ్రీనివాసన్ దర్శకుడు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది.
4) ధర్మపురి :
ఈ తెలుగు మూవీ డిసెంబర్ 2 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
5) మాన్స్టర్ :
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మలయాళం మూవీ డిసెంబర్ 2 నుండి తెలుగు, తమిళ , హిందీ భాషల్లో కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
6) గుడ్ బై :
రష్మిక, అమితాబ్ బచ్చన్ .. ముఖ్య పాత్రల్లో నటించిన ఈ హిందీ మూవీ డిసెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
7) వదంతి :
ఈ తమిళ వెబ్ సిరీస్ డిసెంబర్ నుండి.. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ , మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
8) నిథమ్ ఓరు వానమ్ :
ఈ తమిళ మూవీ డిసెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
9) క్వాలా :
ఈ హిందీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
10) డైరీ ఆఫ్ ఏ వింపీకిడ్: రోడ్రిక్స్ రూల్స్ :
ఈ మూవీ డిసెంబర్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
11) ఫ్రెడ్డీ :
ఈ హిందీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
12) ఇండియన్ లాక్ డౌన్ :
ఈ హిందీ మూవీ డిసెంబర్ 2 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
13) మాన్ సూన్ రాగా :
ఈ హిందీ మూవీ డిసెంబర్ 2 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
14) క్రష్డ్ సీజన్ -2 :
ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
15) మిరల్ :
ఈ తమిళ సినిమా ‘ఆహా తమిళ్’ ఓటీటీలో డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.