బాలీవుడ్ లో సత్తా చాటిన 15 సినిమాలు.. మరియు వాటి నెట్ కలెక్షన్లు..!

బాలీవుడ్లో మన సౌత్ సినిమాల డామినేషన్ మెల్లమెల్లగా ఎక్కువవుతుంది. ఒకప్పుడు సౌత్ నుండీ నార్త్ లో మార్కెట్ ఏర్పరుచుకున్న హీరోలుగా రజినీకాంత్, కమల్ హాసన్ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ‘బాహుబలి’ తర్వాత సౌత్ సినిమాల పై మోజు అక్కడి జనాలకి బాగా పెరిగింది.దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయి ఏంటన్నది వారికి రుచి చూపించాడు. ఆ తర్వాత వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘సాహో’ ‘పుష్ప ది రైజ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి చిత్రాలు ఆ మోజుని వారిలో ఇంకా పెంచాయనే చెప్పాలి. ఇప్పుడైతే ‘కె.జి.ఎఫ్2’ మూవీ ఏకంగా మొదటి రోజు కలెక్షన్ల విషయంలో అక్కడి సినిమాల్ని పక్కకి నెట్టి టాప్ పొజిషన్లో నిలిచింది. దాంతో బాలీవుడ్ జనాలకి సౌత్ సినిమాల భయం ఎక్కువైనట్టే కనిపిస్తుంది. అందుకే అక్కడి క్రిటిక్స్ తో మన సౌత్ సినిమాల పై విమర్శలు గుప్పిస్తూ వారి కడుపు మంటని చల్లార్చుకుంటున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. బాలీవుడ్లో భారీ నెట్ కలెక్షన్లను సాధించిన సినిమాలు ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి :

1) బాహుబలి 2 :

రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్లో ఏకంగా రూ.510.99 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.

2) ఆర్.ఆర్.ఆర్ :

చరణ్- ఎన్టీఆర్ లతో రాజమౌళి తీర్చిదిద్దిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ఇప్పటివరకు రూ.245 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది.

3) 2.0 :

శంకర్- రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఏకంగా రూ.189.55 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీలో విలన్ గా అక్షయ్ కుమార్ నటించడంతో అతని క్రేజ్ వల్ల ఆ ఫీట్ సాధ్యమైంది.

4) సాహో :

ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ ఏకంగా రూ.159.58 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఈ మూవీలో కూడా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, శ్రద్దా కపూర్ వంటి చాలా మంది బాలీవుడ్ స్టార్లు నటించారు.

5) బాహుబలి ది బిగినింగ్ :

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.118.7 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

6) పుష్ప ది రైజ్ :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.102 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

7) కె.జి.ఎఫ్2 :

ప్రశాంత్ నీల్- యష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ నిన్ననే(ఏప్రిల్ 14 న) విడుదలై ఒక్కరోజులోనే రూ.53.95 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి రికార్డులు సృష్టించింది.

8) కె.జి.ఎఫ్ చాప్టర్ 1 :

ప్రశాంత్ నీల్- యష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.44.09 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

9) కబాలి :

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.28 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

10) రోబో :

శంకర్- రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.23.84 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

11) రాధే శ్యామ్ :

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.21.22 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

12) విశ్వరూపం :

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.13.5 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

13) ఐ :

విక్రమ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.11.5 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

14) కాలా :

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.10.38 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

15) ఘాజి :

రానా హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.10.25 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus