మంచి మనసుందని నిరూపించుకున్న నటులు

భారతీయ చిత్ర పరిశ్రమలోని హీరోలు నిజ జీవితంలోను అనేక సార్లు హీరోలని నిరూపించుకున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించారు. మంచి మనసుందని అనిపించుకున్నారు. అయితే గ్రామాలను దత్తత తీసుకొని ఈ ఊరి రూపు రేఖల్ని మార్చిన నటులు తక్కువమంది ఉన్నారు. అటువంటి వారిపై ఫోకస్..

1. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా స్పూర్తితో మహేష్ తన సొంతూరు అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణ లోని సిద్ధాపూర్ (మహబూబ్ నగర్) గ్రామాన్నీ దత్తత తీసుకొని అన్ని వసతులు కల్పించి స్మార్ట్ విలేజ్ గా మార్చుతున్నారు.

2. షారుఖ్ ఖాన్ NDTV తలపెట్టిన గ్రీనాథన్ అనే కాంపెయిన్ లో భాగంగా ఒరిస్సా లో 12 గ్రామాలను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.

3. ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ లో కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక వసతులు కల్పిస్తున్నారు.

4. అమీర్ ఖాన్ 2001 లో భూకంపం వల్ల గుజరాత్ లో చాలా నష్టం జరిగింది. ఆ రాష్ట్రంలోని భుజ్ అనే నగరాన్ని మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ దత్తతకు తీసుకున్నారు.

5. మురళి మోహన్ ఆంధ్ర ప్రదేశ్ నీటి, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగాపురం అనే గ్రామాన్ని నటుడు, నేత మురళీ మోహన్ దత్తత తీసుకుని బాధలను తొలిగించారు. తెలంగాణ లో కూడా నడిగూడెం విలేజ్ ని దత్తతతీసుకొని బాగుచేసారు.

6. నానా పటేకర్ మహారాష్ట్ర లో 4 గ్రామాలను దత్తతు తీసుకోవడమే కాకుండా ఒక గ్రామప్రజలు ఒకొక్కరికి పదిహేను వేలు చొప్పున చెక్కులు ఇచ్చారు.

7. శ్రీ హరి అక్షర ఫౌండేషన్ ద్వారా దివంగత నటుడు శ్రీ హరి మేడ్చల్ లోని మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ధన సహాయం కూడా చేశారు.

8. కరీనా కపూర్ మధ్యప్రదేశ్ లో చండేరీ అనే విలేజిని దత్తత తీసుకొని మూడు లక్షలతో విద్యుత్ సదుపాయాన్ని కల్పించింది.

9. సుమన్ హీరో, విలన్ పాత్రల్లో మెప్పించిన సుమన్ మహబూబ్ నగర్ జిల్లాలోని సుద్దపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

10. వివేక్ ఒబెరాయ్ 2005 లో సునామి వల్ల నష్టపోయిన తమిళనాడులోని దేవనాపట్నం గ్రామాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దత్తత తీసుకున్నారు. అలాగే అనంతపురం లోని ముథువకుంట్ల అనే గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా మార్చారు.

11. సూర్య అగారం ఫౌండేషన్ తో చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించిన సూర్య తిరువళ్లూరు జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

12. మంచు విష్ణు ఆర్మీ గ్రీన్ ప్రోగ్రాం ద్వారా తిరుపతి లో 5 గ్రామాలను దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

13. షాహిద్ కపూర్ NDTV తలపెట్టిన గ్రీనాథన్ అనే కాంపెయిన్ లో భాగంగా ఐదు గ్రామాలను షాహిద్ కపూర్ దత్తత తీసుకున్నారు.

14. సల్మాన్ ఖాన్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఔరంగా బాద్ లోని 200 గ్రామాలను దత్తత తీసుకొని ఎన్ని పనులు చేపట్టారు.

15. చిరంజీవి మోడీ సంసాద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి లోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

16 . సోను సూద్అరుంధతి సినిమాలో భీకరమైన విలనిజం చూపించిన సోను సూద్ , నిజ జీవితంలో మంచి మనసున్న వ్యక్తిగా చాటుకున్నారు. తన స్వరాష్ట్రమైన పంజాబీ లోని మారు మూల గ్రామం “బాహోన” ను దత్తత తీసుకున్నారు. ఆ ఊరికి ప్రధానంగా మంచి నీళ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. పరిశుభ్రతపై ద్రుష్టి పెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus