Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

  • July 9, 2020 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

పువ్వుపుట్టగానే పరిమిళిస్తుంది.. అన్నట్టుగా కొంతమంది చిన్నప్పుడే అత్యంత ప్రతిభను కనబరుస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగుతున్న తారలు బాల్యంలోనే చక్కగా నటించి అభినందనలు అందుకున్నారు. స్కూల్ కి వెళ్లే వయసులోనే కెమెరా ముందు నిలబడి అభినయాన్ని పలికించారు. అటువంటి నటీమణుల గురించి ఫోకస్ ..

నిత్యా మీనన్

“అలా మొదలయింది” చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ నిత్యామీనన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ చిన్నప్పుడే ఇంగ్లిష్ చిత్రం “ద మనీ హు నో టూ మచ్(1998 )”లో నటించింది. పదేళ్ల వయసప్పుడే అనుభవం ఉన్న నటిలా నటించి ప్రశంసలు అందుకుంది.

హన్సిక

దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన హన్సిక చిన్నప్పుడే స్టార్ హీరోతో సినిమా చేసింది. “హమ్ కౌన్ హై” అనే హిందీ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి బాలనటిగా హన్సిక మెప్పించింది. అనేక హిందీ సీరియల్స్ లోను నటించి అభిమానులను సొంతం చేసుకుంది.

శ్రావ్య

సందడే సందడి.. ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి శ్రావ్య మంచి మార్కులు కొట్టేసింది. లవ్ యూ బంగారం మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, గత ఏడాది వచ్చిన నందిని నర్సింగ్ హోమ్ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది.

కీర్తి సురేష్

నేను శైలజ చిత్రంలో అందరి హృదయాలను గెలుచుకున్న కీర్తి సురేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి సురేష్ కుమార్ నిర్మాత. తల్లి మేనక నటి. 80 వ దశకంలో బిజీ హీరోయిన్. మలయాళం, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తల్లి నుంచి నటనను వారసత్వంగా అందుకొని కీర్తి బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. 2000 సంవత్సరంలో వచ్చిన పైలెట్స్ మూవీలో కీర్తి నటనతో అభినందనలు అందుకుంది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా మరో రెండు చిత్రాల్లో కనిపించింది.

శ్రీ దివ్య

జగపతిబాబు, అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాని జాగ్రత్తగా చూస్తే ఓ చిన్నారి ముద్దుముద్దుగా మనల్ని ఆకర్షిస్తుంది. ఆమె ఎవరో కాదు “మనసారా” సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దివ్యనే. చిన్నప్పుడే భయం లేకుండా కెమెరా ముందు పర్ ఫార్మెన్స్ ఇచ్చి.. నేడు బిజీ తారగా ఎదిగింది.

మంజిమ మోహన్

సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్యకు జంటగా నటించిన మలయాళ బ్యూటీ బాల నటిగా ఎనిమిది సినిమాలు చేసింది. 1998 నుంచే మలయాళ సినిమాల్లో నటిస్తోంది. “మధురనంబరకట్టు” అనే మూవీలో నటనకు గానే కేరళ స్టేట్ నుంచి మంజిమ మోహన్ ఉత్తమ బాలనటి అవార్డు అందుకుంది.

శ్రియ శర్మ

జై చిరంజీవ.. చిత్రంలో చిరంజీవి మేనకోడలుగా చిన్నారి శ్రియ శర్మ ముద్దుగా ఆకట్టుకుంది. దూకుడు చిత్రంలోనూ సమంతకు చెల్లెలిగా నటించి శెభాష్ అనిపించుకుంది. 2015 లో రిలీజ్ అయిన గాయకుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అంకిత

సింహాద్రి సినిమాలో “చీమ చీమ” పాటతో బాగా ఫేమస్ అయిన నటి అంకిత. ఈమె హీరోయిన్ గా లాహిరి లాహిరి చిత్రం ద్వారా అడుగుపెట్టినా.. చిన్నప్పుడే రస్నా వాణిజ్య ప్రకటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది.

షాలిని

జగదేక వీరుడు అతిలోక సుందరి, బ్రహ్మ పుత్రుడు తో పాటు షాలిని దక్షిణాది భాషల్లో బాలనటిగా 40 సినిమాలు చేసింది. తెలుగులో హీరోయిన్ గా కనిపించినప్పటికీ మళయాలం, తమిళ భాషల్లో కథానాయికగా 10 చిత్రాల్లో నటించి అలరించింది.

షామిలి

షాలినికి చెల్లెలు అయిన షామిలి అక్కతో కలిసి చిన్నప్పుడే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కనిపించింది. రాజు.. రాజు.. అంటూ ఆకట్టుకుంది. అంజలి చిత్రంలో నటనకు గాను ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ఓయ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా అడుగు పెట్టి అభినయంతో అందరినీ కట్టిపడేసింది.

శ్రీ దేవి

ఇక మరో చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీ దేవి. తన నాలుగో ఏట శ్రీ దేవి కెమెరా ముందుకు వచ్చారు. “తుణైవన్” అనే తమిళ సినిమాలో బాల మురుగన్ గా నటించారు.

అనుష్క మల్హోత్రా

అనుష్క మల్హోత్రా, 2001 సినిమాలో విడుదలైన డాడీ సినిమాలో నటించిన ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక మోడల్ గా పనిచేస్తోంది. కాకపోతే ప్రస్తుతం అనుష్క మల్హోత్రా బాలీవుడ్ ఎంట్రీ కొట్టడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది.

సుహాని

బాల రామాయణం సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నారి ముద్దుముద్దుగా మనల్ని ఆకర్షిస్తుంది. అయితే 2004 సంవత్సరం వరకు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది సుహాని. ఇక 2007 సంవత్సరం నుంచి సవాల్ సినిమా ద్వారా హీరోయిన్ గా మారిపోయింది

నిత్య శెట్టి

దేవుళ్ళు సినిమాలో నటించిన అమ్మాయి నిత్య శెట్టి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తోంది. అయితే 2016 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా చేసేసింది నిత్య. తమిళ, తెలుగు సినిమాల్లో కలిసి నిత్య శెట్టి ఏకంగా ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..

సునైనా

చిన్నప్పుడు మనం చూసిన అమ్మోరు సినిమాలో దేవత గా నటించిన అమ్మాయి సునైనా. ఓ బేబీ సినిమా లో ఒక పాత్ర చేసింది. అయితే సునైనాకు అప్పట్లో తర్వాత పెద్దగా అవకాశం రాకపోవడంతో కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్, కొన్ని సైడ్ ఆర్టిస్ట్గానే పని చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్త గా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

శ్వేతా బసు ప్రసాద్

శ్వేతా బసు ప్రసాద్ 2002 నుంచి 2006 సంవత్సరం వరకు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో .. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే డైలాగ్ తో ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది.తరువాత ‘కాస్కో’ ‘రైడ్’ ‘కలవర్ కింగ్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. మరికొన్ని కుర్ర హీరోల సినిమాల్లో కూడా నటించింది కానీ అవేమీ హిట్ అవ్వలేదు.తరువాత ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో… తమిళ, హిందీ పరిశ్రమల వైపుకి షిఫ్ట్ అయ్యి.. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించింది. ఇప్పటివరకు ఈవిడ అనేక భాషల్లో 13 సినిమాల్లో హీరోయిన్గా నటించింది.

దివ్య నగేష్

దివ్య నగేష్ 2009 సంవత్సరంలో వచ్చిన అరుంధతి సినిమాలో అరుంధతి చిన్ననాటి క్యారెక్టర్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని సంవత్సరాల తరవాత నేను నాన్న… అనే ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక అలాగే కన్నడ, మలయాళ చిత్రాల్లో నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hansika
  • #keerthy suresh
  • #Nithya Menen
  • #Shalini
  • #Shamili

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

5 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

5 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

20 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

23 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

19 mins ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

20 mins ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

1 hour ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

2 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version