ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు/ వెబ్ సిరీస్ లు..!

అక్టోబర్ నెల వచ్చేసింది. మొదటి వారం ‘గాడ్ ఫాదర్’ ‘ది ఘోస్ట్’ ‘స్వాతి ముత్యం’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ‘గాడ్ ఫాదర్’ మినహా మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాను. అయితే ‘గాడ్ ఫాదర్’ ను కూడా జనాలు ఎగబడి చూసెయ్యడం లేదు. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే కొంతలో కొంత నయం అంతే..! అలాగే ఈ సినిమా కూడా జనాలను థియేటర్లకు తీసుకురాలేకపోతుంది. మరోపక్క గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనాలు ఇంట్లో కూర్చొని ఓటీటీల్లోనే సినిమాలు/ సిరీస్ లు చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ప్రతీవారం కుప్పలు కుప్పలుగా కొత్త సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా అంతే..! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సినిమాలు సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) నేను మీకు బాగా కావాల్సిన వాడిని : కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 14 నుండి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ మరియు ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

2) అన్ స్టాపబుల్ సీజన్ 2 : అక్టోబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది.

3) దోబారా : తాప్సీ నటించిన ఈ బాలీవుడ్ మూవీ అక్టోబర్ 15 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

4) హోలీ ఫ్యామిలీ : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5) వెందు తనిందతు కాదు : ఈ తమిళ మూవీ అక్టోబర్ 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

6) ట్రిగర్ : ఈ తమిళ సినిమా అక్టోబర్ 14 నుండి ఆహా-తమిళ్లో స్ట్రీమింగ్ కానుంది.

7) గుడ్ బ్యాడ్ గర్ల్ : ఈ హిందీ మూవీ అక్టోబర్ 14 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) ది ప్లే లిస్ట్ : ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) ది వాచర్ : ఈ హాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) మిస్ మ్యాచ్డ్ : ఈ బాలీవుడ్ సిరీస్ అక్టోబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11)ఎవరీ థింగ్ కాల్స్ ఫర్ సాల్వేషన్ : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) ది కర్స్ ఆఫ్ ది బ్రిడ్జి హాలో : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) ది రింగ్స్ ఆఫ్ పవర్ – ఫైనల్ : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) రోసలిన్ : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 14 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) ఆషికానా సీజన్ 2 : ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 14 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) షి హల్క్ : ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

17) బఫన్ : ఈ తమిళ మూవీ అక్టోబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

18) పాల్తూ జాన్వర్ : ఈ మలయాళం మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus