Weekend Releses: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

డిసెంబర్ నెల ఎండింగ్ కు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ‘హిట్2’ తప్ప ఈ నెలలో మరో హిట్టు సినిమా పడలేదు. డబ్బింగ్ సినిమా అయిన ‘అవతార్ 2’ నే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ వారం క్రిస్మస్ పండుగ ఉండడంతో.. కచ్చితంగా ఈ వీకెండ్ కు కూడా ఆ సినిమా డామినేషన్ ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. అయితే క్రిస్మస్ కానుకగా తెలుగులో కూడా రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయట. అలా అని ఓటీటీలు కూడా.. మేమేమి తక్కువ కాదు అంటున్నాయి. బోలెడన్ని సినిమాలు/సిరీస్ లు ఈ వీకెండ్ కు సందడి చేయబోతున్నాయి. లేట్ చేయకుండా ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) లాఠీ : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన ఈ కాప్ డ్రామా డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. ఎ.వినోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పై పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్లు కూడా సో సోగానే ఉన్నాయి. కాకపోతే విశాల్ ఈ చిత్రం ప్రమోషన్లలో తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఉండడంతో ఈ సినిమా పేరు జనాల నోట్లో నానుతుంది.

2) కనెక్ట్ : స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు అయిన విగ్నేష్ శివన్ నిర్మించాడు.

3) ధమాకా : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పై మంచి బజ్ ఉంది.

4) 18 పేజెస్ : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది. ‘కార్తికేయ2′ తో హిందీలో కూడా మార్కెట్ ఏర్పాటు చేసుకున్న నిఖిల్ సినిమా కాబట్టి.. ’18 పేజెస్’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

5) సర్కస్ : రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ హిందీ మూవీ కూడా డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది.

ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు :

6) మసూద : థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘మసూద’.. డిసెంబర్ 21 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

7) జయ జయ జయ జయహే : ఈ మలయాళం మూవీ డిసెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం : అల్లరి నరేష్ హీరోగా, ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 23 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

9) తార వెర్సెస్ బిలాల్ : ఈ హిందీ మూవీ డిసెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) ది టీచర్ : అమలా పాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మలయాళం మూవీ డిసెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) టాప్ గన్ మేవరిక్ : ఈ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

12) పిచర్స్ : ఈ హిందీ డిసెంబర్ 23 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

13) ఎమిలి ఇన్ ప్యారిస్‌: ఈ సిరీస్‌ డిసెంబర్‌ 21 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) ఎలైస్‌ ఇన్‌ బోర్డర్‌ లాండ్‌ : ఈ హాలీవుడ్‌‌ మూవీ డిసెంబర్‌ 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) గ్లాస్‌ అనియన్‌: నైవ్స్‌ అవుట్‌ మిస్టరీ : ఈ హాలీవుడ్‌ మూవీ డిసెంబర్‌ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) ది ఫ్యాబులెస్‌ : ఈ కొరియన్‌ సిరీస్‌ డిసెంబర్‌ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

17) షడ్యంత్ర : ఈ హిందీ వెబ్‌ సిరీస్‌ డిసెంబర్‌ 18 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

18) బిగ్‌ బెట్‌ : ఈ కొరియన్‌ సిరీస్‌ డిసెంబర్‌ 21 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

19) కాట్మాండు కనెక్షన్ : ఈ హిందీ సిరీస్ డిసెంబర్ 21 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

20) ది ఫాబ్యులస్ : ఈ కొరియన్ సిరీస్ డిసెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus