టాలీవుడ్‌లో నటించిన 20 మంది మాలీవుడ్ యాక్టర్స్ వీళ్లే..!

  • March 20, 2023 / 12:11 PM IST

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఎందరో టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఉన్నారు.. తమ నటనతో పోషించే పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేస్తూ.. ఆ పాత్రలకు తాము తప్ప మరొకరు న్యాయం చేయలేరన్నంతగా ముద్ర వేశారు.. తమ టాలెంట్ కేవలం తమ భాషకి మాత్రమే పరిమితం చేయకుండా ఇతర భాషల్లోనూ నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇటీవల కాలంలో మలయాళం నుండి తెలుగుకి వెర్సటైల్ యాక్టర్స్ వస్తున్నారు.. ‘పుష్ప : ది రైజ్’ తో ఫాహద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టగా.. నాని ‘దసరా’ తో షైన్ టామ్ చాకో.. పంజా వైష్ణవ్ తేజ్ మూవీతో జోజు జార్జ్ వంటి వారు తెలుగు నాట అడుగు పెడుతున్నారు.. ఇప్పటి వరకు తెలుగులో నటించిన (నటిస్తున్న) 20 మంది పాపులర్ మాలీవుడ్ నటలెవరో ఇప్పుడు చూద్దాం..

1) మమ్ముట్టి..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. కె. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ‘స్వాతికిరణం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.. తర్వాత సుమన్‌తో కలిసి ‘సూర్య పుత్రులు’ సినిమా చేశారు.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత రాజ శేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ లో ఆకట్టుకుని.. ఇప్పుడు అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ లో విలన్‌గా నటిస్తున్నారు..

2) మోహన్ లాల్..

ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.. బాలకృష్ణ ‘గాండీవం’ మూవీలో ‘గోరువంక వాలగానే’ పాటలో బాలయ్య, రోజా, ఏఎన్నార్‌లతో కలిసి కనిపించారు.. ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ లో పూర్తి స్థాయి పాత్రలతో అలరించారు..

3) సురేష్ గోపి..

సూపర్ స్టార్ సురేష్ గోపి ‘అంతిమ తీర్పు’, ‘విక్రమార్కుడు’ విలన్ అజయ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కడు’ తెలుగులో చేసిన చిత్రాలు..

4) రాజన్ పి దేవ్..

 

‘ఖుషి’, ‘ఆది’, ‘ఆయుధం’, ‘దిల్’, ‘ఒక్కడు’ ఇలా పలు సినిమాల్లో విలన్‌గా మెప్పించి.. కీలకపాత్రల్లోనూ ఆకట్టుకున్నారు..

5) వినాయకన్..

యంగ్ యాక్టర్ వినాయకన్.. కళ్యాణ్ రామ్ ‘అసాధ్యుడు’ మూవీలో నటించాడు.. సినిమా ఫ్లాప్ అయినా కానీ ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి..

6) ఎన్.ఎన్. పిళ్లై..

సీనియర్ మలయాళీ నటుడు ఎన్.ఎన్. పిళ్లై.. మలయాళం రీమేక్ ‘గాడ్ ఫాదర్’ రీమేక్ ‘పెద్దరికం’ (జగపతి బాబు హీరో) లో నటించి ఆకట్టుకున్నారు..

7) సాయి కుమార్..

సాయి కుమార్.. ‘విష్ణు’, ప్రభాస్ ‘అడవి రాముడు’, బాలయ్య ‘సింహా’ వంటి సినిమాలు చేశారు..

8) మురళి (మురళీ ధరన్ పిళ్లై)..

సీనియర్ మాలీవుడ్ యాక్టర్ మురళి ‘జెమిని’ మూవీలో కమీషనర్ నరేంద్రనాథ్ చౌదరిగా కనిపించారు..

9) కళాభవన్ మణి..

మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న కళాభవన్ మణి.. ‘జెమిని’ లో వెరైటీ విలన్‌గా అలరించారు.. ‘ఆయుధం’, ‘అర్జున్’, ‘నరసింహుడు’, ‘ఎవడైతే నాకేంటి’ వంటి చిత్రాల్లో కనిపించారు..

10) బిజు మీనన్..

‘రణం’ మూవీతో ప్రతినాయకుడిగా పరిచయమైన బిజు మీనన్.. తర్వాత రవితేజ ‘ఖతర్నాక్’ లో నటించారు..

11) జయరాం..

అనుష్క ‘భాగమతి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు మరో టాలెంటెడ్ మలయాళీ నటుడు జయరాం.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రవితేజ ‘ధమాకా’ తర్వాత ‘రావణాసుర’, రామ్ చరణ్ RC 15, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీస్ చేస్తున్నారు..

12) దుల్కర్ సల్మాన్..

మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ తో పరిచయమై.. ‘సీతా రామం’ తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు..

13) ఫాహద్ ఫాజిల్..

వెర్సటైల్ యంగ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప : ది రూల్’ లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అదరగొట్టేశారు.. ‘పుష్ప : ది రూల్’ లోనూ నటిస్తున్నారు..

14) మనోజ్ కె జయన్..

‘సరిగమలు’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కె జయన్.. ‘వీడే’, ‘నాయుడు LLB’, ‘శౌర్యం’ సినిమాల్లో కనిపించారు..

15) ప్రతాప్ పోతన్..

ప్రతాప్ పోతన్ ‘ఆకలి రాజ్యం’, ‘కాంచన గంగ’, ‘జస్టిస్ చక్రవర్తి’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘మరో చరిత్ర’ (2010), ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘వీడెవడు’ (సచిన్ జోషి) మూవీస్ చేశారు..

16) లాల్..

సీనియర్ నటుడు లాల్.. బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ తో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు..

17) ఉన్ని ముకుందన్..

‘జనతా గ్యారేజ్’ తో డెబ్యూ ఇచ్చి.. ‘భాగమతి’, ‘ఖిలాడి’, ‘యశోద’ చిత్రాల్లో నటించాడు..

18) షైన్ టామ్ చాకో..

నాని నటించిన పాన్ ఇండియా మూవీ ‘దసరా’ తో షైన్ టామ్ చాకో ఎంట్రీ ఇస్తున్నారు..

19) పృథ్వీరాజ్ సుకుమారన్..

పాపులర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘సలార్’ లో జగపతి బాబు కొడుకుగా కనిపించనున్నారు..

20) దేవ్ మోహన్..

యంగ్ యాక్టర్ దేవ్ మోహన్.. సమంత పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’ లో దుష్యంతుడిగా నటించాడు..
(సలార్)

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus