Devara: ఆ సాంగ్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ మామూలుగా ఉండవా.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. 140 రోజుల తర్వాత థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. నాటు నాటు సాంగ్ ను మించి దేవర మూవీ సాంగ్ ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదుర్స్ అనేలా ఉంటాయని తెలుస్తోంది.

2000 మంది డ్యాన్సర్స్ తో ఈ సాంగ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. అనిరుధ్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చారని ఈ సాంగ్ తారక్ ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం అందుతోంది. అలూమినియం ఫ్యాక్టరీ దగ్గర వేసిన విలేజ్ సెట్ లో ప్రస్తుతం దేవర షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన ప్రేమ్ రక్షిత్ ఈ సాంగ్ కోసం పని చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎన్టీఆర్ ప్రేమ్ రక్షిత్ కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కాంబో కావడంతో ఈ సాంగ్ కూడా స్పెషల్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ రేంజ్ ను మరింత పెంచేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా భైరా పాత్రలో సైఫ్ కనిపించనున్నారు.

సముద్ర తీరాల బ్యాక్ డ్రాప్ లో (Devara) ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. 2024 బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో వార్2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీ కానున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus