అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2016 సంవత్సరానికి కొన్ని రోజుల్లో గుడ్ బై చెప్పనున్నాం. టాలీవుడ్ ఈ ఇయర్ ని విజయం తో స్వాగతించింది. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం వంటి భారీ సినిమాలు ఫెయిల్ కావడం ముల్లులా గుచ్చుకుంటున్నప్పటికీ చిన్న చిత్రాలు భారీ విజయాలు సొంతచేసుకొని కొత్తవారికి ఉత్సాహాన్నిచ్చింది. తెలుగులో ఈ సంవత్సరం విడుదలై హిట్ సాధించిన చిత్రాలపై ఫోకస్..
జనతా గ్యారేజ్కొరటాల శివ కథ, కథనం, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తోడవ్వడంతో జనతా గ్యారేజ్ ఈ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మిశ్రమ స్పందన అందుకున్న ఈ మూవీ 135 కోట్లు రాబట్టి టాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకుంది.
సరైనోడుస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ అంటూ నటించిన సరైనోడు రిలీజ్ అయిన కొత్తల్లో ఫ్లాప్ అని టాక్ తెచ్చుకున్నప్పటికీ మెల్లగా వేగం పుజుకుని బన్నీకి బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 127 కోట్లు వసూల్ చేసి ఈ ఏడాది అత్యధిక వసూల్ చేసిన రెండో చిత్రం గా స్థానం సంపాదించుకుంది.
నేను శైలజ2016 లో ఇండస్ట్రీ కి తొలి విజయం నేను శైలజ చిత్రం ద్వారా దక్కింది. జనవరి ఫస్ట్ న విడుదలైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తండ్రి, కూతురు సెంటిమెంట్ తో సాగిన ఈ చిత్రం ఎనర్జిటిక్ హీరో రామ్ కి గొప్ప విజయాన్ని అందించింది. “నేను శైలజ” 40 కోట్లను వసూల్ చేసి రామ్ స్థాయిని పెంచింది.
నాన్నకు ప్రేమతోజూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” అంటూ స్టైల్ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సుకుమార్ ఇంటలిజంట్ స్క్రీన్ ప్లే తో క్లాస్ ఆడియన్స్ ని అలరించింది. 80 కోట్లను కొల్లగొట్టింది.
సోగ్గాడే చిన్ని నాయనకింగ్ నాగార్జున మరోసారి టాలీవుడ్ అందగాడని “సోగ్గాడే చిన్నినాయన” చిత్రం ద్వారా నిరూపించుకున్నారు. ద్విపాత్రాభినయం పోషించి హిట్ కొట్టారు. తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఎక్కువ లాభాలను రాబట్టింది.
“క్షణం”ఒక పాప తప్పిపోయింది.. ఆమెను రక్షించాలి.. సింపుల్ లైన్. కానీ కథలో ఎన్ని ట్విస్టులు.. చివరి వరకు కొనసాగిన సస్పెన్స్ “క్షణం” చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది. కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా
రూ. 8 కోట్లు వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది. కథలో పట్టుంటే స్టార్ హీరో అవసరం లేదని ఈ చిత్రం మరో సారి చాటింది.
ఊపిరిసోగ్గాడే చిన్ని నాయన హిట్ తో ఉన్న నాగార్జునకు ఊపిరి జోష్ ని ఇచ్చింది. తన స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన ఈ మూవీ కనక వర్షం కురిపించింది. ప్రయోగ చిత్రాల్లో విషయం ఉంటే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఊపిరి నిరూపించింది.
అ.. ఆజూన్ 2న రిలీజ్ అయిన “అ.. ఆ” సినిమా తొలిరోజే రూ.14 కోట్లు వసూల్ చేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ పవర్ ను చూపించాయి. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వేసవిలో కూల్ హిట్ అందుకుంది.
పెళ్లిచూపులువిజయ్ దేవరకొండ, రీతూ లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2016 సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరింది. అచ్చమైన తెలుగు చిత్రం గా పేరు తెచ్చుకుంది.
బిచ్చగాడుపిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం బిచ్చగాడు. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది డబ్బింగ్ మూవీ అయినప్పటికీ స్ట్రైట్ చిత్రంగా కలక్షన్లు వచ్చాయి. 50 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.
ప్రేమమ్మలయాళంలో రూపుదిద్దుకున్న “ప్రేమమ్” 2015 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత ఏడాది మల్లూవుడ్ లో అత్యధిక కలక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ కథతో యువసామ్రాట్ నాగ చైతన్య తెలుగులో చేసిన ప్రేమమ్ ఇక్కడ కూడా విజయాన్ని సొంతం చేసుకుంది.
ఎక్కడికి పోతావు చిన్నవాడాహారర్ కామెడీ సినిమాల హావ తగ్గుతున్న సమయంలో అటువంటి సబ్జెక్ట్ తో తెరకెక్కిన సినిమా “ఎక్కడికి పోతావు చిన్నవాడా”. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో రిలీజ్ అయి హిట్ అందుకుని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ధృవఈ ఏడాది ఒకే ఒక్క చిత్రంతో రామ్ చరణ్ తేజ్ పలకరించారు. అదే ధృవ. అనేక వాయిదాల తర్వాత డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మెగా పవర్ ని చూపించింది. ఐదు రోజుల్లోనే 30 కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతోంది. ఓవర్ సీస్ లో రికార్డు సృష్టిస్తోంది. 2016 వెళ్తూ ధృవ లాంటి హిట్ ని టాలీవుడ్ కి అందించింది.
సాహసం శ్వాసగా సాగిపోవిభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ లేటుగా అయినా లేటెస్ట్ గా రిలీజ్ అయింది. యువ సామ్రాట్ నాగచైతన్య, మలయాళ నటి మంజిమ మోహన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ యువతకి కొత్త ఫీల్ ని అందించింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాతో నాగ చైతన్య ఈ ఏడాది రెండు విజయాలను సొంతం చేసుకున్నారు.
జెంటిల్ మ్యాన్ఈ సంవత్సరం నేచురల్ స్టార్ నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జ్యో అచ్చుతానంద లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వగా, హీరోగా కృష్ణగాడి వీరప్రేమగాధ, జెంటిల్ మ్యాన్ , మజ్ను చిత్రాలు వచ్చాయి. వీటిలో మంచి పేరుతో పాటు భారీ కలక్షన్స్ అందుకున్న మూవీ జెంటిల్ మ్యాన్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘అష్టా చమ్మా’ తర్వాత నాని చేసిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డ్యూల్ రోల్ లో నాని అదరగొట్టి హిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు.