ఆరంభం అదిరింది….!!! కానీ ??

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు 2017 ఆరంభం కలసి వచ్చింది అనే చెప్పాలి….ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచిన మెగాస్టార్ 150వ చిత్రం….నందమూరి నట సింహం 100వ చిత్రం మంచి హిట్స్ అందుకున్నాయి…..పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ రొటీన్ మాస్ మసాలా అయినప్పటికీ…బాక్స్ ఆఫీస్ వద్ద మంచి మార్క్స్ వేయించుకుంది….ఇక ఈ ఇయర్ సంక్రాంతి రేసులో తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా కూడా బ్లాక్ బష్టర్ హిట్ అందుకుంది. శాతకర్ణిగా బాలయ్య అదరగొట్టాడు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు….క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచి కలక్షన్స్ కూడా అదే రేంజ్లో వచ్చేలా చేసుకుంది. దాదాపుగా 77.7 కోట్లతో టాప్ 5 కలెక్షన్స్ లో స్థానం పొందింది ఈ చిత్రం…..ఇక ఈ రెండింటి మధ్య చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం దక్కించుకున్న సినిమా శతమానం భవతి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేశాడు. పొంగల్ సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మరో పక్క సంక్రాంతి సీజన్ పక్కన పెడితే….నాని నేను లోకల్ అంటూ వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా…..డ్యూయెల్ హ్యాట్రిక్ కొట్టాడు…వీటన్నింటికి కధ ఒకటి అయితే…సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఘాజి సినిమా…సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో 1971లో జరిగిన భారత్ పాక్ అండర్ వాటర్ వార్ గురించి చక్కగా చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు…. రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు. ఇక అన్ని రసాల్లో భక్తి రసం కూడా ఒకటి కాబట్టి …..కింగ్ నాగార్జున రాఘవేంద్ర రావు కలిసి చేసిన భక్తి రస చిత్రం ఓం నమో వెంకటేశాయ సైతం మంచి టాక్ సంపాదించుకుంది….అయితే ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే….రివ్యూస్ బాగానే వచ్చినా సినిమా వసూళ్ల పరంగా కాస్త వెనుకబడి….పోయింది అనే చెప్పాలి…ఇక మెగా హీరో సాయి ధర్మ తేజ విన్నర్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడింది…..మొత్తంగా చూసుకుంటే….2017ఆరంభం అయితే అదిరింది….!!! మున్ముందు ఏమవుతుందో చూడాలి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus