Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హీరోలు, డైరెక్టర్లకు ఉత్సాహాన్నిచ్చిన 2017

హీరోలు, డైరెక్టర్లకు ఉత్సాహాన్నిచ్చిన 2017

  • December 29, 2017 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలు, డైరెక్టర్లకు ఉత్సాహాన్నిచ్చిన  2017

ఎన్ని విజయాలను చూసిన వారికైనా ఒక్క అపజయం వస్తే చాలు.. వెనక్కి వెళ్ళిపోతారు. సినీ పరిశ్రమలో అయితే పలకరించేవారు కూడా తగ్గిపోతారు. హిట్ కొట్టకపోతే కనుమరుగు అయిపోవడం ఖాయం. ఆ గండం నుంచి ఈ ఏడాది కొంతమంది హీరోలు, డైరక్టర్లు తప్పించుకున్నారు. హిట్ అందుకొని మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. అటువంటి వారిపై ఫోకస్..

ఖైదీ నంబర్ 150 (చిరంజీవి ) Khaidi No 150“నన్ను ఇప్పుడు ఆదరిస్తారా?”.. అనే ప్రశ్న మెగాస్టార్ చిరంజీవిని ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చేశాయి. తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడాన్ని, తొలి చిత్రంలా భావించి ఆయన కష్టపడ్డారు. ప్రయోగాల జోలికి పోకుండా హిట్ అయిన కథతో ఖైదీ నంబర్ 150 అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ఒక వారంలో వంద కోట్ల గ్రాస్, రెండో వారానికి వంద కోట్ల షేర్ ని వసూల్ చేసి మెగా స్టార్ సత్తాన్ని చాటింది.

రారండోయ్ వేడుక చూద్దాం (నాగ చైతన్య ) Rarandoi Veduka Chuddamయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ మూవీతో చైతూ మంచి పేరు తెచ్చుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ అందమైన మూవీ భారీ కలక్షన్స్ వసూలు చేసింది

గౌతమి పుత్ర శాతకర్ణి (బాలకృష్ణ) Gautamiputra Shatakarniలయన్, డిక్టేటర్ వంటి అపజయాలతో రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్న బాలకృష్ణకి గౌతమి పుత్ర శాతకర్ణి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో బాలకృష్ణ మళ్ళీ మీసం తిప్పారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో చక చక సినిమాలు చేస్తున్నారు.

గరుడ వేగ (రాజశేఖర్) Garuda Vegaప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 125.18” సూపర్ హిట్ గా నిలిచింది. రెండేళ్ల తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ థియేటర్లోకి వచ్చినప్పటికీ ఆదరణ తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 230 థియేటర్స్ లో రిలీజై తొలి రోజు రోజు 2.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాజశేఖర్ కి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.

రాజా ది గ్రేట్ (రవితేజ) Raja The Greatమాస్ మహారాజ్ రవితేజ రెండేళ్ల గ్యాప్ తో వచ్చినప్పటికీ వెండితెరపై అతని జోష్ పెరిగిందే తప్ప తగ్గలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ అంధుడిగా నటించిన “రాజా ది గ్రేట్” చూసిన తర్వాత అందరూ రవితేజ ది గ్రేట్ అన్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ రవితేజకి కంబ్యాక్ మూవీగా నిలిచింది.

ఫిదా (శేఖర్ కమ్ముల) Fidaaమంచి కాఫీలాంటి చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ములకి పదేళ్లుగా మంచి హిట్ లేదు. హ్యాపీడేస్ తర్వాత అతను చేసిన ఆవకాయ్ బిర్యానీ, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, అనామిక.. అన్ని ప్లాప్ అయ్యాయి. ఈ ఏడాది వరుణ్, సాయి పల్లవితో చేసిన ఫిదా 60 కోట్లు వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.

మళ్ళీరావా (సుమంత్) Malli Raavaఅక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్ కి సత్యం సినిమా తర్వాత చెప్పుకోదగ్గ విజయం లేదు. అయినా నిరాశ పడకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ ఏడాది అతనికి మళ్ళీరావా మూవీ ఊపిరినిచ్చింది. గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సుమంత్ కి సూపర్ కంబ్యాక్ మూవీగా నిలిచింది.

తేజ (నేనే రాజు నేనే మంత్రి) Nene Raju Nene Mantriజయం సినిమా తర్వాత తేజకి విజయమే లేకుండా పోయింది. దాదాపు పదిహేనుళ్లుగా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. చివరికి రానా తోను నేనే రాజు నేనే మంత్రి అని ప్రయోగం చేశారు. హీరోకి నెగిటివ్ క్లైమాక్స్ ఇచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. డైరక్టర్ గా పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు.

ఫిదా (వరుణ్ తేజ్ ) Fidaaలోఫర్, మిస్టర్ సినిమాల అపజయాలతో నిరాశలో ఉన్న వరుణ్ తేజ్ కి ఫిదా మంచి ఉత్సాహాన్నిచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూడు రోజుల్లోనే 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి వరుణ్ తేజ్ రేంజ్ పెంచింది.

వివి వినాయక్ (ఖైదీ నంబర్ 150) Khaidi No 150మంచి హిట్స్ ఇచ్చిన వివి వినాయక్ కి అఖిల్ సినిమా ఉన్న పేరును మొత్తం లాక్కెళ్ళింది. ఇక వినాయక్ దగ్గర స్టాఫ్ అయిపోయిందని టాక్ మొదలైంది. ఆ చెడ్డ పేరును ఖైదీ నంబర్ 150 సినిమాతో చెరిపేసుకున్నారు. రీమేక్ అయినప్పటికీ నేటివిటీకి తగ్గట్టు మార్చి మెప్పించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2017 Movies
  • #Fidaa
  • #Garuda Vega
  • #Gautamiputra Satakarni
  • #Khaidi No 150

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

22 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

23 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

2 days ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

2 days ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version